మనో విధి
• అడగగనే వడివడిగ
దడివచ్చిన కాట్రేడువే …
• కుడిఎడమల ఎడవిడిచి
సరిపడగ వరములీడ.
• తడబడినా భ్రమపడినా
దరి వీడకు వేడికంటి …
• ఎండనీడల యడబాయగ
కొడగట్టిన కడబ్రతుకులు .
• కడివెడు నీ కృప తోడుగ
దివి చేరు కాయంబిక …
• దడబిడల సడి జేరదు
శాశ్వతముగ నీ ఒడిని జేర …
• వశపడినా వెంటపడినా
శివుని వీడ నే నేలపడినా.
🙏ఓం నమః శివాయః.
• అడగిన తక్షణమే కాలం తో రక్షణగా వచ్ఛిన స్మశానాధిపతి.
కుడి ఎడమ లను తోసిపుచ్చి కావలసిన వరములిచ్ఛావు.
• తెలియక తప్పు చేసినా, మాయలో పడినా నా సమీపం విడువకు ఓ ఉగ్రాక్షుడా .
ఎండ నీడలు దూరం గా పెట్టిన , స్పర్శ లేని అంటు జీవితాలు.
• గుప్పెడంత నీ దయ తోడుంటే పరలోకం చేరును ఇక ఈ జీవం.
శాశ్వతం గా నీ ఒడి లో చేరితే, ఏ అలజడుల శబ్దం మనసు కి చేరదు.
• దేనికైనా స్వాధీనమై నా, ఆశించి నా, తుదకు కింద పడి పతనమై పోయినా నేను శివుని వీడను.
🙏ఓం నమః శివాయః.
యడ్ల శ్రీనివాసరావు
7 June 2024 7:00 PM
No comments:
Post a Comment