మేఘజీవన
• నడిచే వెన్నెల నీవైతే
కురిసే మంచును నేనవుతా.
• మెరిసే తారవు నీవైతే
కదిలే మేఘం నేనవుతా.
• సాగే ఈ పయనం ఆఖరి మజిలీ
తీరే ఈ శయనం అమర లోగిలి.
• నడిచే వెన్నెల నీవైతే
కురిసే మంచును నేనవుతా.
• మెరిసే తారవు నీవైతే
కదిలే మేఘం నేనవుతా.
• గాలి లోని నేను
నీ శ్వాస లో నిలిచాను.
• తాళ లేక నేను
నీ మది లో మాటేసాను.
• స్వేధ మైన నేను
నీ మేని లో కలిసాను.
• వీడ లేని నేను
నీ నుదిటి నంటి ఉన్నాను.
• పాడే ఈ రాగం ప్రేమ కు అజరామరం
వేగే ఈ బంధం విశ్వం లో సవికాశం.
• నడిచే వెన్నెల నీవైతే
కురిసే మంచును నేనవుతా.
• మెరిసే తారవు నీవైతే
కదిలే మేఘం నేనవుతా.
అమర = దేవత, మరణం లేని.
అజరామరం = స్థిరమైనది.
వేగే = తపించే
సవికాశం = ప్రకాశించునది.
యడ్ల శ్రీనివాసరావు
14 June 2024 8:30 PM.
No comments:
Post a Comment