అందరూ మంచి వారు
• అందరూ మంచి వారు
మనుషులందరూ మంచి వారు.
• మమతలతో మధురిమలు
పంచుకుంటు ఉంటారు.
• మాయ ను తెలియక
మైమరచి ఉంటారు.
• అందరూ మంచి వారు
మనుషులందరూ మంచి వారు.
• కొందరి మాటలు మకరందాలు.
జీవానికి ప్రాణం పోస్తారు.
• మరికొందరి మాటలు మలినాలు.
జీవాన్ని నిర్జీవం చేస్తారు.
• ఇంకొందరి మాటలు మంచు కత్తులు.
నమ్మించి నడుము లో పొడుస్తారు.
• అందరూ మంచి వారు
మనుషులందరూ మంచి వారు.
• మమతలతో మధురిమలు
పంచుకుంటు ఉంటారు.
• మాయ ను తెలియక
మైమరచి ఉంటారు.
• తెలివైన వారు చతురత చూపిస్తారు.
ఏ ఎండకు ఆ గొడుగు లో ఉంటారు.
• తెలివిలేని వారు చతికిల బడతారు.
మీన మేషాల దిక్కులు చూస్తారు.
• మనసు ను
నమ్ముకున్న వారు కొందరు.
• మనసు ను
అమ్ముకునే వారు మరి కొందరు.
• మనసు ను
ఎరుగని వారు ఇంకెందరో …
• అందరూ మంచి వారు
మనుషులందరూ మంచి వారు.
• మమతలతో మధురిమలు
పంచుకుంటు ఉంటారు.
• మాయ ను తెలియక
మైమరచి ఉంటారు.
యడ్ల శ్రీనివాసరావు
13 June 2024 7:00 PM.
No comments:
Post a Comment