Wednesday, June 12, 2024

510. చినుకు జారింది

 

చినుకు జారింది


చినుకు    జారింది

  చలికి      వణికింది.

• విరజాజి   విచ్చింది

  మనసేమో  అదిరింది.

 

• జల్లుల     సవ్వడి లో

  ఓ కోక      ఆడింది.

• గాలుల    ఒరవడి లో

  ఆ రైక    తడిచింది.


• అలజడుల   పరువం లో …

  అధరం …

  సుమధురమై    తాకింది.

 

• ఇది   ఉరుముల    మెరుపుల   కళ్యాణం.

  ప్రకృతి    పురుషుల    వసంతం.


• చినుకు    జారింది

  చలికి     వణికింది.

• జాజి    విచ్చింది

  మనసు   అదిరింది.


• చూపుల     సంగమం లో

  తడబడిన       చినుకులు

  మునిపంటి పై   నిలిచాయి.

• విడిచిన     శ్వాస లో

  వెల్లువైన      వెచ్చదనం

  చుబుకం  పై  చేరింది.


• పరవశాల     పల్లవింపు లో ...

  ఆరాధన .‌‌..

  ఆస్వాద నై       సాగింది.


• ఇది  ఉరుముల   మెరుపుల  కళ్యాణం.

  ప్రకృతి    పురుషుల    వసంతం.


• చినుకు     జారింది

  చలికి      వణికింది.

• జాజి    విచ్చింది

  మనసు   అదిరింది.


యడ్ల శ్రీనివాసరావు 

12 June 2024, 8:00 PM .





No comments:

Post a Comment

651. శివోన్నతి

  శివోన్నతి • తనువు న    నీ  వే   తపన లో     నీ   వే   అణువణువు న   స్మృతి లో   నీ   వే   బాబా   . . .   ఓ  శివ బాబా . • నీ   తోడు   లేన...