ఎపుడైతే నీవు కలిసావు నాతో
• ఎపుడైతే నీవు కలిసావు నాతో
తెలిసింది
నీవే నా సర్వస్వం అని.
• ఎపుడైతే నీవు పలికావో నాకు
తెలిసింది
నీకు నేను ప్రియమని .
• మనసు తో నిను చూడని నాడు
ఎకడెకడో తిరిగాను
ఏడేడో వెతికాను .
• నీ ప్రేమ తరంగం
తాకుతునే ఉంది
నా అంతరంగం.
• నీ మాట మకరందం
చేరుతునే ఉంది
నా మస్తిష్కం.
• ఎపుడైతే నీవు కలిసావు నాతో
తెలిసింది
నీవే నా సర్వస్వం అని.
• ఎపుడైతే నీవు పలికావో నాకు
అనిపించింది
నీకు నేను ప్రియమని .
• ఆరుతున్న దీపాన్ని
జ్యోతి గా చేస్తున్న
జ్యోతి స్వరూపుడవు .
• బ్రహ్మ బడికి పంపి
చదువు నేర్పిస్తున్న
జ్ఞాన సాగరుడవు .
• జన్మ జన్మలు గా కలుషితమైన
కలువలను కర్మ శుద్ది చేస్తావు.
• మాయా కోరల్లో చిక్కుకున్న
జీవాత్మలను పునీతం చేస్తావు.
• బంధించిన కాలాలలో
నీ తోడే వెలుగు.
• ఆ . . . కాల బంధనమే నిను
చేరేందుకు తెరువు.
• ఎపుడైతే నీవు కలిసావు నాతో
తెలిసింది
నీవే నా సర్వస్వం అని.
• ఎపుడైతే నీవు పలికావో నాకు
తెలిసింది
నీకు నేను ప్రియమని .
🌹🌹🌹🌹🌹🌹
భగవంతుడు, పరమాత్మ శివుని కోసం బయట ప్రపంచంలో అన్వేషణ చేస్తున్నంత కాలం కనపడడు, వినపడడు. కానీ ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. నీ నిత్య సత్య అసత్య స్థితులను గమనిస్తూ ఉంటాడు . . .
ఏదో నాడు ఆయనే స్వయంగా నీ మనసును స్పృశించినపుడు , నీ మూలం లో జ్యోతి వలే కనపడతాడు, నీ మౌనం లో ఓం కార నాదమై వినపడతాడు. అదే నీకు దివ్య అనుభవం. ఆ అనుభూతి తోనే నిను ముందుకు నడిపిస్తాడు .
శివుడే తోడైన నాడు . . . చీకటి అజ్ఞానం దుఃఖం వంటి , నీ నీడల పట్ల చింత వలదు .
నీ నీడలో నీ వెన్నంటి నడిచేది కూడా శివుడే. శివుడికి నీవు కావాలి . నీ కర్మలను శుద్ది చేయాలి. లోక కళ్యాణార్దం నీతో ఏదో చేయించాలి .
ఓం శాంతి .
శివ బాబా 🙏
యడ్ల శ్రీనివాసరావు 27 Oct 2026 11:30 AM


No comments:
Post a Comment