Tuesday, November 10, 2026

803 . మౌనంగా అందరినీ వదిలేయండి -1

 

మౌనంగా అందరినీ వదిలేయండి 

(మొదటి భాగం)


జీవితంలో ప్రశాంతంగా ఉండటం ఎలా ?  

మనం ఎవరినైనా ఒక్కసారిగా దూరం పెట్టినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

దీని ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయడం . ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు , భరించి భరించిన తరువాత కలిగిన ఒక లోతైన మరియు నిజమైన అవగాహన . 

ఇది పారిపోవడం కాదు తనను తాను రక్షించుకోవడం . ఇది  ద్వేషం కాదు  ఆత్మగౌరవం . చాలాసార్లు ఇతరులను పట్టుకొని ఉండే ప్రయత్నంలో మనుషులు తమకు తాముగా దూరమైపోతారు. అందరినీ మెప్పించే ఈ పరుగులో వారు తమ  శాంతిని  మరియు  తమ సత్యాన్ని రెండింటిని  కోల్పోతారు . ప్రతి ఒక్కరికీ వివరిస్తూ వివరిస్తూ  తన  శక్తంతా  కోల్పోయి ఒకరోజు అలసిపోయి తను తాను ప్రశ్నించుకుంటాడు , నేను ఎక్కడున్నాను అని. . . . మరియు అదేరోజు లోపలి నుండి  ఒక నిశ్శబ్దమైన గాలి , శక్తివంతమైన గొంతు వినిపిస్తుంది. ఇప్పుడు నిశ్శబ్దంగా అందరినీ వెనక్కి వదిలేయ్  అని . 

కానీ ఇది అంత సులువా అనిపిస్తుంది . కానీ మును ముందు జరగబోయేది మీ జీవితాన్నే పూర్తిగా మార్చి వేస్తుంది. 

గుర్తుంచుకోండి . . .  ప్రతి ఒక్కరిని మీ జోలి లో తీసుకువెళ్ళడం మీ పని కాదు. ప్రతి ఒక్కరి ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ ఇష్టపడడానికి , మీరు మార్కెట్ లో అమ్మకానికి ఉండే ఏ వస్తువు కాదు . మీరొక అద్భుతమైన శక్తి మరియు ఈ అమూల్యమైన శక్తి తప్పుడు మనుషుల చేతులకు వెళ్ళినప్పుడు అది ఆరిపోవడం  ప్రారంభిస్తుంది . అందువల్ల మీ శక్తి ని కాంతిని లాక్కునే వారి నుండి దూరంగా ఉండటమే తెలివైన పని. 

కొందరు మీ జీవితంలోకి వచ్చి మీలో కొత్త ఆనందాన్ని జాగృతం చేస్తారు. వారితో మీకు సరైన మార్గం దొరుకుతుంది. కానీ మరికొందరు ఉంటారు. వారు దగ్గరకు రాగానే మీ శక్తినంతా పీల్చేస్తారు . మొదట గుర్తించండి , ఎవరు మిమ్మల్ని పైకి లేపుతారు మరియు ఎవరు కిందకు తోస్తారు అని . 


మిమ్మల్ని కిందకు లాగే వారిని నిశబ్దంగా వెనక్కి వదిలేయండి. అపుడు జనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ పై రకరకాల కథలు అల్లవచ్చు , మీ ఉద్దేశాలను ప్రశ్నించవచ్చు మరియు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించవచ్చు. కానీ వారికి మళ్ళీ మళ్ళీ , మీ గురించి వివరించడానికి కూర్చోకండి.  మీరు మౌనంగా ఉంటే కాలమే , వారికి అత్యుత్తమమైన సమాధానం ఇస్తుంది. మాటలతో పోరాటం చేయకండి . కాలం , మౌనం ఈ రెండింటి కంటే పెద్ద వాదం వేరేదీ  ఏదీ లేదు. మారుతున్న మీ జీవితమే , వారికి అతి పెద్ద సమాధానం అవుతుంది. 



కానీ . . . మనం తప్పుడు వాళ్ళను ఎందుకు వదిలి పెట్టలేము . అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?  

దీని వెనక ఉన్న అసలు కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ప్రతి బంధము కాపాడుకునే యోగ్యతను కలిగి ఉండదని మీరు నేర్చుకోవాలి.  కొన్ని బంధాలు కేవలం ఒక అలవాటుగా మారతాయి , ప్రేమతో కాదు .  కొన్ని బంధాలు కేవలం భయంతో నిలిచిపోతాయి  గౌరవంతో కాదు. మరియు కొన్ని బంధాలు  ప్రతిరోజు మీ ఆత్మను కొద్ది కొద్దిగా గాయపరుస్తాయి. అటువంటి బంధాలతో అతుక్కుని ఉండటం పుణ్యం కాదు మూర్ఖత్వం. వాటిని వదిలివేయడం పాపం కాదు మీకు మీరే ఇచ్చుకునే చికిత్స. 


అనేకమందికి  ఒంటరితనం అంటే భయం ఉంటుంది. అందుకే వారు ఇతరులను వదిలి పెట్టలేరు. వారు గుంపులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోవడానికి ఒప్పుకోరు. 


గుర్తుంచుకోండి . . . ఒంటరితనం మీ శత్రువు కాదు .

ఇక్కడే మీరు మొదటిసారి మిమ్మల్ని మీరు కలుసుకుంటారు. గుంపులో మీరు ఇతరుల గొంతు వింటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ అసలైన గొంతు వినిపిస్తుంది. గుంపులో మీరు కేవలం ఒక పాత్రను అభినయిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా మీలాగే ఉంటారు. కాబట్టి కొద్దిసేపు ఒంటరిగా నడవడానికి భయపడకండి. 

అసలైన ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభంవుతుంది.



 మిగిలినది  రెండవ భాగం లో . . . 




No comments:

Post a Comment

803 . మౌనంగా అందరినీ వదిలేయండి -1

  మౌనంగా అందరినీ వదిలేయండి  ( మొదటి భాగం ) జీవితంలో ప్రశాంతంగా ఉండటం ఎలా ?   మనం ఎవరినైనా ఒక్కసారిగా దూరం పెట్టినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది...