మనో శతకం - 8
సౌష్టవంబున మెరుగుల్ శ్రేష్టంబాయెనా
దేహంబున మోహంబు దేహి జేయ
ఆత్మ నెరిగి నందం అంబర మల్లే
పరమాత్మయని పలుకు పతిత పావనంబాయే.
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా ! |20|
భావం :
శరీరానికి ఆకృతులు మెరుగులు దిద్ది నంతలో సౌందర్యం అద్బుతం అగునా.
శరీరం పై కోరిక, మోహం అల్పునిగా చేయును.
నేనొక ఆత్మనని ఎరిగినపుడు అందం ఆకాశమంత అల్లు కొని విస్తారం అగును.
పరమాత్మ అయిన శివుని జపించిన యెడల భ్రష్టులు కూడా శ్రేష్టం గా అవుతారు.
సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
శూన్యంబున దిక్కుల్ సమము గాంచే
మరజీవికి బంధమల్ ఎండమావులాయే
గమ్యమెరిగిన గతి కి దిక్సూచి ఏల
మౌనమున మది పయనించు విశ్వమున.
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా ! |21|
భావం :
శూన్యమున అన్ని దిక్కులు, దిశలు ఒకే విధంగా సమానం గా ఉండును.
కోరికలు లేని జీవికి బంధములు ఎండమావులు అగును. (ఎండమావి లో నీరు ఉన్నట్లు కనిపించును, కానీ నీరు ఉండదు. అదే విధంగా మరజీవికి బంధములతో అనుబంధం ఉండునట్లు ఉండును, కాని ఉండదు.
గమ్యం తెలిసిన దారికి మార్గ దర్శకం ఎందుకు.
ఆలోచన రహిత మనసు విశ్వం లో ప్రయాణం చేస్తుంది.
సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.
యడ్ల శ్రీనివాసరావు 6 March 2024 , 9:15 pm
No comments:
Post a Comment