గవ్వను కాదు గువ్వను
• గువ్వను నేను
ఎగిరే గువ్వను నేను.
• గవ్వను కాను
కదలని గవ్వను కాను.
• సూక్ష్మమైన లోకంలో
సోయగాల సోయి నాది.
• అందమైన వనంలో
అంతులేని హాయి నాది.
• గువ్వను నేను
ఎగిరే గువ్వను నేను.
• గవ్వ నున్నగున్న
గీతలతో గందరగోళం
• గవ్వ తెల్లనైనా
ఇసుక లో నిర్జీవం.
• గవ్వను కాను.
కదలని గవ్వను కాను.
• విహరించే మనసు తో
విరహలను వీడుతాను.
• విహంగమై వెన్నెల లో
విలాసి గా తిరుగుతాను.
• సెలయేటి సవ్వడి లో
సరోవరం పై తేలుతాను.
• గిరులు చుట్టి పల్లె
రాగాలు వల్లె వేస్తాను.
• గువ్వను నేను
ఎగిరే గువ్వను నేను.
• నింగి లో నిలబడి
నేల ను చూస్తుంటాను.
• పల్టీలు కొడుతూ
పరంధామము చేరుతాను.
• గువ్వను నేను
ఎగిరే గువ్వను నేను.
• గవ్వను కాను
కదలని గవ్వను కాను.
యడ్ల శ్రీనివాసరావు 8 March 2024, 9:30 pm.
No comments:
Post a Comment