కాలచక్రం
• ఏనాటి దో ఈ కాలం
ఈనాటి కి తిరిగొచ్చెను.
• ఏపాటి దో ఈ ఆనందం
విడనాడక వరమయ్యెను.
• కవ్వింత నవ్వులతో
పువ్వ ల్లే సాగుతోంది సమయం.
• తుళ్లింత సిగ్గుల తో
మంచ ల్లే జారుతోంది వదనం.
• రవ్వంత రవళి లతో
మువ్వ ల్లే మోగుతుంది మదనం.
• ఏనాటి దో ఈ కాలం
ఈనాటి కి తిరిగొచ్చెను.
• ఏపాటి దో ఈ ఆనందం
విడనాడక వరమయ్యెను.
• ఏకాంతపు సోయగం లో
విరజిల్లెను విరజాజులు.
• అంతరాన ఆ లయం లో
ఆలపించెను ఆమనులు.
• మౌనం లో మధురం
మరు లోకపు వికాసం.
• శాంతం లో సౌమ్యం
సుఖ వాసపు రధం.
• ఏనాటి దో ఈ కాలం
ఈనాటి కి తిరిగొచ్చెను.
• ఏపాటి దో ఈ ఆనందం
విడనాడక వరమయ్యెను.
• రాసిన తల రాతలు రమణీయం.
గీసిన నొస గీతలు గమనీయం.
నిండిన కాంతులు కమనీయం.
తలచిన తలంపులు పూరణం.
గమనీయం = పొందగలిగేది.
యడ్ల శ్రీనివాసరావు 20 March 2024 9:45 pm
No comments:
Post a Comment