పౌర్ణమి గ్రహణం
• మనసు లోగి లో వెలసింది
వెన్నంటి జాబిలి
• తనువు ముంగిట మెరిసింది
మిన్నంటి వెన్నెల
• మౌనమ నే వెలుగు తో
మదిని పులకరింప చేసింది.
• శాంతమ నే శోభతో
కాంతి వికసింప చేసింది.
• మనసు లోగి లో వెలసింది
వెన్నంటి జాబిలి.
• తనువు ముంగిట మెరిసింది
మిన్నంటి వెన్నెల.
• అమావాస్య చీకట్లయినా
గ్రహణాల సర్పాలయినా
చంద్రుని కి చేటేముంది.
మనసు కి పొటేముంది.
• పూర్ణ కుంభం తరిగినా
వికాసానికి లోటేముంది.
కనులకు కానరాకున్నా
హృదయం లో మాటేసుంది.
• మనసు లోగి లో వెలసింది
వెన్నంటి జాబిలి.
• తనువు ముంగిట మెరిసింది
మిన్నంటి వెన్నెల.
• పౌర్ణమి పరిమళం
పాలపొంగు తో నిండింది.
• తారల తళుకులు
మేఘాలలో దాగాయి.
• కాలం ఆడే సయ్యాటే
గ్రహణమనే దోబూచి.
• ఈ క్షణికమైన చీకటే
వెలుగు కి సోపానం.
• మనసు లోగి లో వెలసింది
వెన్నంటి జాబిలి.
• తనువు ముంగిట మెరిసింది
మిన్నంటి వెన్నెల.
యడ్ల శ్రీనివాసరావు 24 March 2024, 11:00 pm.
No comments:
Post a Comment