Wednesday, August 26, 2026

779 . నేను శివుడిని

 

నేను శివుడిని



• నేను శివుడను , నేను పరమాత్మ ను , నేను మంగళాకారుడను , నేనే సత్యము , నేను నిత్యము , నా వలనే చైతన్యము , నేను జ్యోతి బిందు స్వరూపుడు ను , నేను నిరాకారుడు ను,  నేను  జ్ఞానేశ్వరుడను , నేను భైధ్యనాధుడు ను , నేను పరమ పవిత్రుడను , నేను ముక్తి ధాతను . . . ఇలా  భగవంతుడు తనను తానుగా  వర్ణన  చేసుకొన్నాడు అన్నది "నిర్వాణ షట్కం" లో ఆది శంకరాచార్యులు రచించారు . ఇదే “శివోహం”. 


• సృష్టి యొక్క ఆది మధ్య అంత్యములు తెలిసిన వాడు శివుడు . తనను " పదార్థముల కాదు యదార్ధము  " యందు మాత్రమే చూడమని చెప్పాడు . 

 పదార్ధములు అంటే ద్రవ్యరాశి (Mass) తో చలనం కలిగిన దేహము (శరీరము) ,  చలనం లేని శిల (రాయి) మొదలైన వంటి వాటిలో “ నేను “ ఉండను అని చెప్పాడు. 

 యదార్ధం అంటే సత్యం .  మనో నేత్రానికి దర్శనమిస్తూ ,  స్పర్శకు నోచుకొనని , నిశ్శబ్ద  జీవ అనుభవం  యందు ఉంటాను అని చెప్పాడు .

అనగా ఆత్మ (soul),  పరమాత్మ (supreme soul)  యదార్ధం , సత్యం అని తెలియ చేశాడు . 

 ఆత్మ మానవ  శరీరం లో   ఉండును .  

పరమాత్మ  : శరీరం లేని   చైతన్యం  కలిగిన సర్వ శక్తిమంతుడు  , అతడే  శివుడు .


• భగవదారాధన లో మనిషి యొక్క స్థితి వేరు వేరు స్థాయి లుగా మారుతూ ఉంటుంది. నిర్వాణ షట్కాన్ని ఆమోదించగలిగే స్థితి చాలా ఉచ్ఛ స్థితి. ఈ స్థితిని చేరుకొన్న వాడికి పదార్థంతో పని లేదు వాటి సంగతులతోనే  పని. 

దైవం యొక్క ఉనికిని గెలిచిన వాడిని , దైవం వెదకడం మొదలు పెడుతుంది. ఎందుకంటే వాడే సత్పురుడు సమదృష్టి కలిగిన వాడు అని దైవం యొక్క నమ్మకం.  అలాంటి మనిషి  సాంగత్యం  సత్సంగం సమసమాజ  ఉన్నతికి  , లోక కల్యాణానికి ఎంతో  ఉపయోగం అని దైవం నమ్మకం.


• శివ సంకల్పం లో   నిర్వాణ స్థితిని చేరడానికి శివ తత్వం బోధ పడాలి , అనుభవం కావాలి . నిర్వాణ స్థితి అంటే మర జీవి గా అవడం . మరణించిన స్థితి లో జీవించడం . అనగా సర్వ సంబంధాలలో ఉంటూనే  ,  కోరికలకు అతీతంగా  ఏదీ తనకు చెందినది కాదు అనే మనో స్థితి కలిగి ఉండడం . సుఖం దుఃఖం , లాభం నష్టం రెండు ఒకటే అనే శూన్య భావన తో  ఉండడం .


• శివుని గూర్చి తెలుసుకోవడానికి  నీవు త్యాగి , యోగి , జ్ఞాని  కానక్కరలేదు. సత్యాన్ని అంగీకరించే అమాయక మనసు ఉంటే చాలు , అలాగని అదేమంత సులభం కాదు సుమా ! . ‌ . . చెప్పేందుకే నీతులు , చేతలలో బోధనలు బోర్లాపడు.

ఎందుకంటే   గోతి కాడ  నక్క వలే  “మాయ” ఏదో ఒక రూపంలో ,  ఏదో  ఒక వ్యాపకం తో  నీ మనసు ను   కబళించడానికి అనేక ఆకర్షణలతో  నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ  అనుక్షణం సిద్దం గా ఉంటుంది . ఆదమరచావా . . . అంతే సంగతి !


• నిరాకారం , నిరహంకారం , నిర్గుణం , నిర్వాణం చేరుకునే లోపు నీలోని " నేను నాది " అనే అహాన్ని తొలగించగలిగితే  అది నిన్ను రుద్రుని వైపు ఆకర్షితుడు  అయ్యేలా చేస్తుంది. 

ఒక్క సారి  శివుడు  నీ మనసు న  చేరేడా . . . ఆ అనుభూతి  మంచు కొండలపై  వెండి  వెన్నెలే. 


• “ శివోహం “ నేను శివుడను అని అనగలిగేది కేవలం శివుడు మాత్రమే . ఏ మానవ మాత్రుడు శివుడు కాడు , కాలేడు . కానీ మానవుడు శివుని లోని  శక్తి ని  పొందుతూ  శివ శక్తి గా  అవగలడు.


🌹🌹🌹🌹🌹



శరీరం,  జీవితం లో  పోషించే  జగన్నాటక పాత్ర , మరియు  చుట్టూ ఉన్న శబ్దాలన్నింటినీ  దాటి ఉన్న  నిశ్శబ్ద  సత్యం ఇదే  ::  నేను ఒక ఆత్మను.


ఆత్మ జ్ఞానంలోకి  అడుగుపెట్టండి . బయట ప్రపంచం  కంటే  . . . మీ  లోని  నిశ్శబ్దమే మీతో మరింత  స్పష్టంగా  మాట్లాడనివ్వండి .


  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

  ఆత్మ   23 August  2026  9:00 AM.



No comments:

Post a Comment

779 . నేను శివుడిని

  నేను శివుడిని • నేను శివుడను , నేను పరమాత్మ ను , నేను మంగళాకారుడను , నేనే సత్యము , నేను నిత్యము , నా వలనే చైతన్యము , నేను జ్యోతి బిందు...