మాతా శ్రీ వరలక్ష్మీ
• వరము ల వైభోగం వర లక్ష్మీ
వ్రతము న వైభవం శ్రీ వర లక్ష్మీ .
• శివుని జ్ఞానము లో వెలసిన
దివ్య గుణ రాశి వి
మాతా . . . వర లక్ష్మీ .
• ఆత్మ కి జ్యోతి యై
జ్ఞాన సంపదల కాంతి ని నింపే
మాతా . . . శ్రీ వర లక్ష్మీ .
• నీ వరమే వైభోగం
నీ వ్రతమే వైభవం .
• ఆత్మ కు . . .
శాంతి సుఖాలు సత్య సిరులని
ప్రేమ పవిత్రతలు ఐశ్వర్యములని
శక్తి సంతోషాలు శాశ్వత సంపదలని
లలిత వై లాలించావు .
• సత్య యుగ నవ స్వర్గానికి
తొలి మహారాణి వి నీవే .
• శ్రీ కృష్ణుని నవ యుగం లో
శ్రీ లక్ష్మి గా వెలిగే రూపి వి నీవే .
• అష్ట దిక్కులను అష్ట శక్తుల తో
రక్షించే ఆలయ రూపిణి .
• నీ వరమే వైభోగం
నీ వ్రతమే వైభవం .
• వరము ల వైభోగం వర లక్ష్మీ
వ్రతము న వైభవం శ్రీ వర లక్ష్మీ .
• శివుని జ్ఞానము లో వెలసిన
దివ్య గుణ రాశి వి
మాతా . . . వర లక్ష్మీ
• ఆత్మ కి జ్యోతి యై
జ్ఞాన సంపదల కాంతి ని నింపే
మాతా . . . శ్రీ వర లక్ష్మీ .
వరలక్ష్మీ దేవి వ్రతం సందర్భంగా
మహిళలందరికీ నా నమస్కారములు 🙏.
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 21 August 2026 9:10 PM



No comments:
Post a Comment