రాజయోగ ఫలాలు
• గొప్పతనం ఎన్నడూ ప్రతిభ (Talent) వలన రాదు . . . ప్రతిరోజూ మనం చేసే సరైన ఎంపికల ఆచరణ వలన ఏర్పడుతుంది.
మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి.
మీరు ఏ ఆలోచనను పదేపదే ఆలోచిస్తారో, అదే మీ స్వభావంగా , మీ నిర్ణయాలుగా , చివరికి మీ జీవితంగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ శ్రేష్ఠమైన, శక్తివంతమైన , ఉన్నతమైన ఆలోచనలను ఎంచుకోండి.
• మీ సమయం అంటే మీ జీవితమే.
మీ సమయం ఎక్కడ , ఏ విషయం పట్ల వెచ్చించబడుతుందో, మీ జీవితం కూడా అదే దిశలో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ప్రతిరోజూ కొంత సమయాన్ని మీ కోసం , మౌనం కోసం , ధ్యానం కోసం , భగవంతుని స్మృతి కోసం , విశ్వ శక్తి పొందడం కేటాయించండి. ఆ కొద్దిపాటి సమయమే మీ రోజంతా సరైన దిశలో నడిపిస్తుంది.
• మీ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మీరు ప్రతిరోజూ చేసే పనులే క్రమంగా మీ గుర్తింపుగా (Identity ) మారుతాయి.
కాబట్టి ఈ మూడు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి . . .
• శ్రేష్ఠమైన ఆలోచనలు
• సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం
• శ్రేష్ఠమైన అలవాట్లు
నెమ్మదిగా ఇవే మీ గొప్ప శక్తిగా, మీ గొప్పతనానికి పునాదిగా మారతాయి.
🌹🌹🌹🌹🌹
• చాలామంది తమ ఎంపికలను , ఎంచుకున్న వాటిని (Choosens) మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈశ్వరుని రాజయోగం మాత్రం ముందుగా మీ స్వ గుర్తింపును (Identity) మార్చుకోవడం తో ప్రారంభమవుతుంది.
• మీరు “నేను ఈ శరీరం మాత్రమే” అని భావిస్తే, మీ మనసు తాత్కాలిక సుఖాల వెంట పరుగులు తీస్తూనే ఉంటుంది.
కానీ మీరు “నేను శ్రేష్టమైన , ప్రశాంతమైన , విశ్వానికి మేలు చేసే ఆత్మను” అని స్మరించిన క్షణం నుంచే , మీ యొక్క ప్రాధాన్యతలు (Importance’s) నిశ్శబ్దంగా మారడం ప్రారంభిస్తాయి.
క్రమేపీ విశ్వ శక్తిని మీరు ఆవాహన చేయడం ఆరంభిస్తారు. తదుపరి మీ లోని శక్తి కూడా, ఏదో ఒక భాగ్య రూపంలో విశ్వమంతా ప్రసరిస్తుంది.
• మీ జీవిత గత ఎంపికలలో లేదా ఎంచుకున్న (Choosens) వాటి లలో ఏది తప్పో , ఏది మీకు సరి కాదో , దాని నుండి మిమ్మల్ని మీరు బలవంతంగా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు.
అది సహజం గానే మీ నుంచి విడిపోతుంది .
ఇక , అది మీకు సరైనదిగా అనిపించదు . ఎందుకంటే అది మీ స్వభావ ధర్మానికి విరుద్ధమైనది .
• ప్రతి ఉదయం మీ రోజును ప్రారంభించే ముందు, ఒక నిమిషం పాటు
• అసలు నేను ఎవరు ?
• ఎచట నుంచి వచ్చాను ?
• నాతో ఏమి తీసుకొని వచ్చాను ?
• నాతో ఏమి తీసుకు వెళతాను ?
• గతంలో ను నేను ఉన్నాను
• భవిష్యత్తులోనూ నేను ఉంటాను .
అని మీలో మీరు స్మరించుకోండి .
రోజు లో ఏదైనా కఠినమైన నిర్ణయం , పరిస్థితి దీర్ఘంగా ఎదురైనప్పుడు, మళ్లీ అదే ఆత్మిక అవగాహనకు తిరిగి రండి.
• మీ గుర్తింపు మీ ఎంపికలను రూపుదిద్దుతుంది
Your Identity
shape’s
Your Choosens .
• మీ ఎంపికలు మీ విధిని రూపుదిద్దుతాయి.
Your Choosens
shape’s
Your Destiny , Fate , Karma .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
బ్రహ్మ కుమారీస్
ఆత్మ 14 Aug 2026 , 6:00 AM.


No comments:
Post a Comment