ప్రతి మనిషి (ఆత్మ) ఒకే ఒక్క విషయాన్ని వెతుకుతూ ఉంటాడు . అదే శాశ్వతమైన సంతోషం.
మన వెతుకులాటలో తప్పు లేదు, కానీ మనం వెతుకుతున్న దిశలోనే పొరపాటు ఉంది.
ఈ ప్రపంచం కొంతకాలం మాత్రమే మన మనసును ఆనందింపజేయగలదు, కానీ ఆత్మలోని శూన్యతను అది నింపలేదు.
మనం ప్రేమ, శాంతి, సంతోషాలను బయట వెతికే కొద్దీ, ఇతరులపై ఆధారపడటం జరుగుతుంది మరియు మనలోని అశాంతి మరింత పెరుగుతుంది .
ఈశ్వరుని రాజయోగం మనలను సున్నితంగా ఆ ఒక్క శివ పరమాత్మ వైపు తిరిగి తీసుకువెళ్తుంది .
ఆయనే శాంతి, ప్రేమ మరియు సంతోషాల సాగరం.
ప్రతి క్షణం శివ పరమాత్మ స్మృతిలో గడిపినప్పుడు , ఆత్మ ఎప్పటినుంచో వెతుకుతున్నదంతా దాని అంతరంలో నిండిపోతుంది.
అప్పుడు సంతోషం కోసం మనం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. సంతోషమే మన సహజ స్వరూపంగా మారుతుంది.
ఆత్మ, పరమాత్మ అనే అనంత సాగరం నుండి తృప్తిని పొందినప్పుడు, ప్రపంచం ముందు అడగడం ఆపేస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹
ప్రకృతిలోని ప్రతి దానికీ ఒక కాలం ఉంటుంది. ఒక విత్తనం ఒక్క రాత్రిలో చెట్టుగా మారదు. ఒక ముత్యం ఒక్క రోజులో తయారవ్వదు .
సీతాకోకచిలుక కూడా తన రెక్కలను క్షణాల లో తొందరగా విప్పలేదు.
జీవితం కూడా అంతే . . .
మనకు ఆలస్యంగా అనిపించేది చాలాసార్లు నిజానికి మన సిద్ధతా సమయం. ఆ నిరీక్షణలోనే మీ శక్తి పెరుగుతోంది, మీ వ్యక్తిత్వం పరిపక్వత చెందుతోంది, మీ కోసం సరైన పరిస్థితులు నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్నాయి.
సమయాన్ని విశ్వసించండి .
మీ కర్మను చేస్తూనే ఉండండి .
ప్రశాంతంగా ఉండండి .
నిజంగా మీ కోసం ఉద్దేశించబడినది ఎప్పుడూ ఆలస్యంగా రాదు . మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధమైనప్పుడు , సరైన సమయంలో మాత్రమే అది మీ వద్దకు చేరుతుంది.
# బ్రహ్మా కుమారీస్ డెస్క్.
ఓం శాంతి .
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 21 Aug 2026 11:00 AM.


No comments:
Post a Comment