గతంలో మనకు ఎదురైన అనుభవాలు జీవితానికి లోతైన పాఠాలను నేర్పుతాయి . అయితే వాటిని పదేపదే గుర్తుచేసుకుంటూ మనసుపై భారంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. పొందిన పాఠాన్ని జీవితంలో తప్పనిసరిగా ఆచరిద్దాం, మనల్ని మనం క్షమించుకుందాం .
గతం లోని అనుభవానికి , సూక్ష్మం లో గ్రహిస్తే దాని కర్త కర్మ క్రియ మనమే . అది ప్రస్తుత లేదా గత జన్మలలో చేసిన కర్మల ఫలితం .
ప్రస్తుతాన్ని శాంతి, అవగాహన మరియు సానుకూలత తో జీవించడం ఉత్తముల లక్షణం.
🌹🌹🌹🌹🌹
మీ విలువను నిరూపించుకోవడానికి ప్రపంచం వెంట పరుగెత్తాల్సిన అవసరం ఎప్పుడూ లేదు.
మీ అసలైన విలువను . . శాంతిమయమైన , శక్తివంతమైన ఆత్మగా . . . మీరు గుర్తుంచుకోవడం మాత్రమే అవసరం.
మీరు ఆత్మిక అవగాహనతో (నేను ఆత్మను) జీవించినప్పుడు , మీ ఆలోచనలు ఉన్నతంగా , మీ చర్యలు శక్తివంతంగా మారతాయి.
మీ ఉనికి మీ విధినే మార్చడం ప్రారంభిస్తుంది.
అప్పుడు జీవితం కూడా భిన్నంగా స్పందిస్తుంది.
సరైన వ్యక్తులు , సరైన అవకాశాలు , సరైన పరిస్థితులు సరైన సమయంలో మీ జీవితంలోకి రావడం ప్రారంభిస్తాయి . అవసరం లేని వాటన్నింటి నుండి విముక్తి లభిస్తుంది .
వెంటపడాల్సిన అవసరం లేదు.
ఆత్మన్యూనత అవసరం లేదు.
పోరాటం అవసరం లేదు.
కేవలం ఆత్మగౌరవం , భగవంతుని తోడు మరియు మీ నిజమైన స్వరూపంలో ఉండే నిశ్శబ్దమైన శక్తి మాత్రమే మీ సంపూర్ణ బలం .
ఇది అదృష్టం వలన ఏర్పడేది కాదు.
ఇది ఆత్మ యొక్క చైతన్యం మరియు సహజ సిద్ధమైన మైన నియమం.
🌹🌹🌹🌹🌹
ప్రతి రోజు చివరిలో మీ సంపాదన మీ జేబులోని లెక్కను మాత్రమే తెలియజేస్తుంది.
కానీ మీ కర్మలు మీ జీవితానికి నిజమైన విలువను తెలియజేస్తాయి.
ఈ రాత్రి నిద్రపోయే ముందు మీతో మీరు ప్రశ్నించుకోండి.
“ఈ రోజు నేను ఎవరి మనసును తేలికపరిచాను?”
“ఎవరి ముఖంపై చిరునవ్వు తీసుకువచ్చాను?”
“నా వల్ల ఈ రోజు ఎవరు ఆప్యాయతను అనుభవించారు?”
ఒక మధురమైన మాట...
కొంచెం సహనంతో ఉండటం...
ఎవరైనా చెప్పేది శ్రద్ధగా వినడం...
లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయడం...
ఇలాంటి చిన్న చిన్న మంచి కర్మలే జీవితంలో అతి పెద్ద సంపాదనగా మారుతాయి.
పదవి, ధనం , పరిచయాలు - కాలంతో పాటు కనుమరుగైపోతాయి.
కానీ, నిస్వార్థమైన ప్రేమతో చేసిన మంచి కర్మలు మాత్రం ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి.
ఓం శాంతి
ఓం నమఃశివాయ
# బ్రహ్మకుమారీస్ డెస్క్
యడ్ల శ్రీనివాసరావు 30 Aug 2026 10:30 AM



No comments:
Post a Comment