పరిమళ భాష
• ఏమిటో ఈ భాష
ఎద కే తెలియని ఆశ.
అనుభవం లేని యాస
సృష్టి మూలానికి శ్వాస.
• అక్షరాలు ఉండవు కానీ
భావం పలుకుతు ఉంటుంది.
• కనులు చూడలేవు కానీ
మనసు చదువుతూ ఉంటుంది.
• ఏమిటో ఈ భాష
ఎదకే తెలియని ఆశ.
అనుభవం లేని యాస
సృష్టి మూలానికి శ్వాస.
• గజిబిజిల గందరగోళం లో నైనా
పులకింతలు నింపుతుంది.
• ఎగుడు దిగుడు తలంపుల కైనా
మధురిమలు పలికిస్తుంది.
• ఎవరూ నేర్పని ఈ భాష
సహజమై ప్రకృతి లో ఉంది.
• సకల జీవుల ఊపిరి కి
ఆయువై మూలం గా ఉంది.
• ఏమిటో ఈ భాష
ఎదకే తెలియని ఆశ.
అనుభవం లేని యాస
సృష్టి మూలానికి శ్వాస.
• అంతరంగం లో అలజడి అయినా
అంతరాత్మ లో ఆనందం అయినా
భాష లో ని భావం
పరిమళమైన భాగ్యం.
• ఏమిటో ఈ భాష
ఎదకే తెలియని ఆశ.
అనుభవం లేని యాస
సృష్టి మూలానికి శ్వాస.
యడ్ల శ్రీనివాసరావు 27 March 2024 9:00 pm.
No comments:
Post a Comment