సంకల్పాలు – నిదర్శనాలు
• మనిషి కి తన జీవితంలో ఆశించిన వి , కోరుకున్నవి తీరుతూ ఉంటే మనసు లో సంతోషాన్ని అనుభవించే తీరు పెరుగుతూ ఉంటుంది.
కొన్ని సార్లు ఉన్న స్థితి కి అతీతమైనవి గా అనిపించినా సరే , ఊహించిన ఆలోచనలు ప్రయత్నం చేయకుండానే నిజం అయితే ఆనందం ఉరకలు వేస్తుంది. అవి చిన్నవి అయినా, పెద్దవి అయినా సరే ఆశ్చర్యం లో మునిగి తేలుతూ ఉంటాం. ఇది ఆత్మ విశ్వాసం పెరగడానికి దోహదం అవుతుంది. దీనినే సంకల్ప బలం అని కూడా అంటారు.
• పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా నటుడు గా కంటే కూడా, పది సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ లో ఉన్నప్పటి నుంచి ఆయన ఆలోచన సరళి, నిజాయితీ కోసం ఎవరినైనా ధైర్యం గా ఎదిరించి ఒంటరిగా పోరాటం చేయడం , ఆయన తన ధనాన్ని సహయత కి ఉపయోగించడం వంటివి ఆశక్తి గా అనిపించేవి. నటుడి గా ఆయన మీద అభిమానం అనే దాని కంటే , ఆయనకు సమాజం పట్ల ఉన్న సరళి నాకు అసక్తి గా ఉండేది . బహుశా ఇదే ప్రభావం తో , గత సంవత్సరం ఎన్నికల సమయంలో “జన గళం “ అనే పాట స్వతహాగా ప్రేరణ తో రాయడం జరిగింది .
రాజకీయాల పై అంతగా ఆసక్తి లేని నాకు, ఇటీవల కొన్ని సభ లలో , ప్రతీ అంశం పట్ల లోతైన అవగాహన తో పాటు జ్ఞాన యుక్తం గా మూలాల్లోకి వెళ్లి మాట్లాడి, ప్రజలకు అర్దం చేస్తున్న తీరు నాకు చాలా బాగా అనిపించింది . ఒక నాయకుడు ఆధ్యాత్మిక చింతన , భావాలు కలిగి ఉండి రాజకీయంగా ప్రజలకు సామాజిక సేవ చేయడం , నైతికత ను పాటించడం అంటే అంత సాధారణ విషయం కాదు . అది అందరికీ సాధ్యం కాదు .
• సుమారు, నాలుగైదు నెలల క్రితం ఒక టి.వి. ఛానెల్ లో ఒక సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ని చూస్తున్నప్పుడు , మనసు లో అనిపించింది ఈయనను నేను అసలు డైరెక్ట్ గా చూడగలనా, కలవగలనా అని మనసులో బలంగా అనిపించింది. నా ఆలోచన కి నాలో నేను నవ్వు కున్నాను . ఎందుకంటే అది సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ ఎందుకో ఒకసారి ఆయనను చూస్తే బాగుండు అని అప్పుడప్పుడు మూడు నాలుగు నెలల క్రితం అనిపించేది .
• ఒకరోజు . . . మే నెల 21 వ తేదీ రాత్రి 9:00 గంటలకు మా ఆశ్రమం నుంచి గురువుగారు అకస్మాత్తుగా ఫోన్ చేసారు .
గురువు గారు : శ్రీనివాస్, … రేపు తెల్లవారు జామున 5 గంటలకు, మనం విజయవాడ వెళ్ళాలి . . . ఉదయం 9:00 గంటలకు ఒక ఫంక్షన్ కి హాజరు కావాలి , నువ్వు తప్పని సరిగా రావాలి, తిరిగి మధ్యాహ్నానికి వచ్చేద్దాం . . . నీకు రేపు వీలవుతుంది కదా .
నేను : (ఏమీ ఆలోచించకుండా) సరే నండి.
ఏ ఫంక్షన్ , ఏమిటి అని ఆయనను నేను అడగలేదు. ఏదో వివాహ కార్యక్రమానికి, గురువు గారు ఆశీర్వాదం ఇవ్వడానికి, వెళుతున్నా రేమో అని మనసు లో అనుకున్నాను.
• మరుసటి రోజు శనివారం , నాకు సెంటిమెంట్ గా Black Blue (Saturn colours) dress వేసుకుని 5:00 గంటలకు గురువు గారి తో విజయవాడ బయలు దేరాము.
విజయవాడ సమీపం లో కి వెళుతుండగా. . .
నేను : గురువు గారు . . . మనం హాజరు అయ్యేది పెళ్లికా ? . . . ఫంక్షన్ హాలు విజయవాడ లో ఎక్కడండి ?
గురువు గారు : పెళ్లి కాదు . పవన్ కళ్యాణ్ ని కలవడానికి తుమ్మల పల్లి కళాక్షేత్రం లో . ఈ రోజు ప్రకృతి జీవ వైవిధ్య సదస్సు (BIO DIVERSITY DAY) అక్కడ జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి ముగ్గురు ఉత్తమ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి, ఈ రోజు అవార్డు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు. ఇందులో మన కడియం గ్రామం నుంచి , బాగా తెలిసిన ఒకరికి అవార్డు వచ్చింది. ఆయన నిన్న నన్ను కలిసి గురువు గారు మీరు తప్పకుండా రావాలి , మీరు చూస్తుండగా నేను అవార్డు తీసుకోవాలి అని చెప్పి, VIP పాస్ లు ఇచ్చారు .
నేను : నాకు ఒక నిమిషం . . . ఏం అర్దం కాలేదు . ఇది కలా ? నిజమా ? అనిపించింది .
• ఇంతలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకున్నాం . విపరీతంగా పోలీసులు , సెక్యూరిటీ ఉంది . బయట విపరీతమైన పబ్లిక్ , వారిని లోనికి పంపించడం లేదు .
అవార్డు గ్రహీత అయిన రైతు ద్వారా వచ్చిన పాస్ అవడం వలన స్టేజ్ ఎదురు గా మొదటి వరుసలో కూర్చునే అవకాశం లభించింది.
• సుమారు 11:30 గంటలు సమయం లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా 15 మంది Black commando protection చుట్టూ వలయం ఉంది.
ప్రోగ్రాం సుమారు రెండున్నర గంటల పాటు జరిగింది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం 50 నిమిషాలు జరిగింది. ఆయనకు ఎదురుగా డైరెక్ట్ గా 15 అడుగుల దూరంలో మొదటి వరుసలో కూర్చోని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది .
• ఆయన ప్రసంగం తరువాత, అవార్డు గ్రహీతల ను మాత్రమే స్టేజ్ పైకి పిలుస్తున్నారు.
ఆ సమయంలో స్టేజ్ మొత్తం సెక్యూరిటీ కంట్రోల్ లో ఉంది .
• ఆ సమయంలో మా గురువు గారు మనసు లో సంకల్పం చేశారంట, పవన్ కళ్యాణ్ గారి ని స్వయం గా కలిసి ఆయనకు , తన తో తీసుకు వచ్చిన లక్ష్మీనారాయణల ఫోటో బహుకరించాలి అని .
• ఇంతలో మా కడియం రైతు గారిని స్టేజ్ మీద కి పిలిచారు . ఆయన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి కి ఏదో చెప్పారు. . . వెను వెంటనే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ కి సిగ్నల్ ఇవ్వడం, మా గురువు గారి ని , ఆశ్రమం లో సిస్టర్స్ ని స్టేజ్ మీద కి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారి కి ఫోటో బహుకరించారు.
గురువు గారితో కలిసి నేను స్టేజ్ ఎక్కుతుండగా , నేను white dress లో లేనని , సెక్యూరిటీ నన్ను stage steps వద్ధ ఆపేశారు . అప్పటికీ మా గురువు గారు , నన్ను పంపించమని సెక్యూరిటీ తో చెప్పినా , వారు నా డ్రెస్ కారణంగా నన్ను ఆపేశారు. . . అయితే నేమి దాదాపు మూడు గంటల సమయం , ప్రశాంతంగా అతి సమీపంలో ఎదురుగా కూర్చుని చూశాను. ఆయన హావభావాలు గమనించాను.
• గత కొన్నాళ్లుగా ఎన్నో ఎన్నెన్నో అనిపించిన ఊహించిన , సంకల్పాలు ఊహించని విధంగా నెరవేరడం ఆశ్చర్యం అనిపిస్తుంది .
ప్రయత్నం చేయకుండానే, మంచి సంకల్పం తో నెరవేరే కోరికలకు స్వయం గా భగవంతుడు సహాయం చేస్తాడు .
యడ్ల శ్రీనివాసరావు 7 July 2025 11:00 AM
No comments:
Post a Comment