ఆనంద నంద రాగం
• ఆనంద నంద రాగం
ప్రభు ప్రేమ సేద సదనం .
అదవదము అంతకరము
అనునయము అంబరాంతము .
• ఆనంద నంద రాగం
ప్రభు ప్రేమ సేద సదనం .
• ఏకాంత స్మృతి న మౌనం
శివ సంధాన ప్రియం .
అంతరము న జీవ యానం
దరహస నిధి సోపానం .
• ఆత్మ పరమాత్మ ల మిలనం
హోళీ ల కేళి మధురం .
అంతఃకరణ ఈ బంధం
జన్మాంతరాల సత్యం .
• ఆనంద నంద రాగం
ప్రభు ప్రేమ సేద సదనం .
• సంతోష సావధానం
జీవన్ముక్తి సౌఖ్యం .
రాజ యోగాభ్యాసం
ప్రభు హృదయాన్వితం .
• ఆస్వాదన ల శివం
జ్ఞానామృతా ల ధారణం .
సుందరుని చేరు ఈ సమయం
భాగ్య రేఖల స్వ గతం .
• ఆనంద నంద రాగం
ప్రభు ప్రేమ సేద సదనం .
అదవదము = కలత , దుఃఖం
అంతకరం = సమూల సమాప్తం .
అనునయం = ఉపశమనం , ఓదార్పు
అంబరాంతము = ఆకాశం అంచు
అంతఃకరణ = మనసు సాధనం
యడ్ల శ్రీనివాసరావు 28 July 2025 11:00 AM.
No comments:
Post a Comment