Monday, July 14, 2025

658. మనో శతకం - 10

 

మనో శతకం - 10


సమసిన  సమయమ్  స్వర్ణంబైన  ఆభరణమ్.

ధారణ నొంద  నీ కాలంబు   ధీనత  నొందున్.

క్షరము న జారెడు  పుష్పంబు  ఫలమగునా .

నోచని యత్నంబున  నిర్వేదం నివసమగున్ .

సుందర గుణేశ్వరా ! సంపన్నేశ్వరా !      |24|


భావం :

గడచి పోయిన కాలమంతా  బంగారం అయిన యెడల ఆభరణము అగును .

అది ధరించని చో   నేటి కాలం   వృధా అగును .

సెలయేటి లో  జారి పోతూ ఉన్న  పువ్వు  ఫలము  అగునా .

చేయని  ప్రయత్నము , నిరాశకు  ఇల్లు అగును .

సుందరమైన గుణములు గల ఈశ్వరా ! సంపన్నుడైన ఈశ్వరా !


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


రాలిన పత్రమ్  రవళించగ  నాడే మయూరి .

వీచిన  మారుతమ్  వినువీధున  వీక్షించేన్ .

అంబర వాణి   బలికే   ఆలంబన రాగం .

తన్మయబొందె   తళుకుల్   తారల్ .

సుందర గుణేశ్వరా  ! సంపన్నేశ్వరా  !      |25|


భావం :

రాలిన ఆకులు  రెప రెపల  శబ్దానికి  నెమలి ఆడెను .

వీచే గాలి  ఆకాశ వీధి   నుంచి  చూచెను .

ఆకాశము నుండి  వాణి  పలికింది  శబ్దానికి ఊతమైన రాగము .

మైమరచి  పోయాయి   మెరిసే  నక్షత్రాలు అన్నీ .

సుందరమైన  గుణములు  గల  ఈశ్వరా ! సంపన్నుడైన  ఈశ్వరా !


యడ్ల శ్రీనివాసరావు 14 July 2025 , 7:30 PM


No comments:

Post a Comment

658. మనో శతకం - 10

  మనో శతకం - 10 సమసిన  సమయమ్  స్వర్ణంబైన  ఆభరణమ్. ధారణ నొంద  నీ కాలంబు   ధీనత  నొందున్. క్షరము న జారెడు  పుష్పంబు  ఫలమగునా . నోచని యత్నం...