ప్రియుడు పిలిచిన వేళ
భగవంతుడు ప్రియుడైన వేళ , ఆయనను ఆరాధించే వారంతా ప్రేయసి లే. కష్టం లో దుఃఖం లో ఉన్న ప్రేయసులను తన మనోహరం పై లగ్నం చేయమని ప్రియుడై పిలిచిన వేళ .
• నీవెవరో నీకు తెలిసేనా .
ఈనాటి కైనా . . .
నీవెవరో నీకు తెలిసేనా .
• నీ మనసు లో దాగి ఉన్న రూపం
శబ్దమై
ఏ నాడూ నిను తాకలేదా . . .
• చెరగని జ్ఞాపకాల చీకటి లో ఎన్నాళ్ళు
చెదిరిన కాలం లో భారం ఇంకెన్నాళ్ళు .
• రా … నాతో రా
కలిసి అడుగులు వెయ్
ఆకాశమంత సంతోషం నీదే .
• ఇక మిగిలిన సమయం కొంత కాలమే . . .
• నీవెవరో నీకు తెలిసేనా .
ఈనాటి కైనా . . .
నీవెవరో నీకు తెలిసేనా .
• ప్రియము లేని చోటు పై
ప్రీతి ఎందుకు .
• వెలుగై నేనున్నాను
నిను
వెన్నెల లో విహరింప చేస్తాను .
• నీ మనసు నాకు ఇవ్వు
ప్రేమంటే ఏమిటో తెలుస్తుంది .
• రా … నాతో రా
కలిసి అడుగులు వెయ్
ఆకాశమంత సంతోషం నీదే .
• నీ ఎదురు చూపులో
కొత్త ఉదయానికి
మనసు తలుపు తట్టే వేళ ఇదే . . .
• నీవెవరో నీకు తెలిసేనా .
ఈనాటి కైనా. . .
నీవెవరో నీకు తెలిసేనా .
• నీవెవరో నీకు తెలిసేనా .
ఏనాటి కైనా. . .
నీవెవరో నీకు తెలిసేనా .
• రా … నాతో రా
కలిసి అడుగులు వెయ్
ఆకాశమంత సంతోషం నీదే .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 19 Nov 2026. 8:30 PM

No comments:
Post a Comment