ఆత్మ తీరం
• భాగ్య మే వైరా గ్య మైన వేళ
ఆనంద మే అనంత ము.
శైవ మే మోహ మైన వేళ
ప్రేమ యే ఆరాధనం.
• సరిగమలు లేని ఈ జీవన రాగం
పదనిసల సెలయేరు లా సాగుతుంది.
• పరిమితులు లేని ఈ జీవన వేదం
ఆటపాటల సింధువు లా సాగుతుంది.
• ఇది ఒక దివ్యం
ఇది ఒక నవ్యం.
• భాగ్య మే వైరా గ్య మైన వేళ
ఆనంద మే అనంత ము.
శైవ మే మోహ మైన వేళ
ప్రేమ యే ఆరాధనం.
• శూన్యం లో విహరించే ఈ బిందువు కి
ఎవరు బంధం … ఏది భారం.
దేహం తో మురిపించే ఆ మాయ కి
ఏది సత్యం … ఏది అసత్యం
• ఇది ఒక భోగం
ఇది ఒక యోగం.
• భాగ్య మే వైరా గ్య మైన వేళ
ఆనంద మే అనంత ము.
శైవ మే మోహ మైన వేళ
ప్రేమ యే ఆరాధనం.
సింధువు = సాగరం
బిందువు = ఆత్మ.
యడ్ల శ్రీనివాసరావు 5 July 2024, 8:00 pm.
No comments:
Post a Comment