కళాశాల 1980
ఎపిసోడ్ – 18
సీన్ – 64
5 సంవత్సరాల పాటు కాలం గడిచింది. రాము కి 56 సంవత్సరాలు వచ్చాయి.
రాము పిల్లలు పెద్ద వారయ్యారు. అమెరికా లో చదువు పూర్తి చేసి , ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. పిల్లలు కోరిక మేరకు అమెరికాలో పూర్తిగా స్థిరపడడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ రాము పూర్తి చేశాడు.
మరో వైపు , విమల ఇద్దరు పిల్లలు కూడా పెద్దవారై ప్రయోజకులయ్యారు. హైదరాబాద్ లో రాము కంపెనీ ఆఫీసు లో ఉద్యోగం చేస్తున్నారు.
విమల జీవితం, తన పిల్లల జీవనం డబ్బు కి ఏ లోటు లేకపోవడం వలన , పూర్తి సౌకర్య వంతంగా, విలాసవంతం గా మారిపోయింది.
ఇంతలో ఒక రోజు , రాము శైలజ ల పెళ్లి రోజు వచ్చింది. అమెరికా నుంచి పిల్లలు ఇద్దరూ కలిసి అమ్మా నాన్నలకు విషెస్ చెప్పారు.
ఆ రోజు , శైలజ గుడికి వెళదాం అంటే …. ఇద్దరూ కలిసి బయలు దేరారు.
దేవుని దర్శనం అయిన తరువాత, గుడి ఆవరణలో ఇద్దరూ కూర్చున్నారు. వారికి పెళ్లి అయి, ఆ రోజు తో 25 సంవత్సరాలు పూర్తి అయింది . కానీ వాళ్లు చూడడానికి ఇంకా 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, అలాగే ఉన్నారు. శైలజ కు రాము పై ప్రేమ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే తను రాము ని అంతగా ఇష్టపడింది. రాము ఏనాడూ శైలజ మాటకు అభ్యంతరం చెప్పేవాడు కాదు.
ఇంతలో శైలజ నెమ్మదిగా రాము చేతిని తన చేతిలోకి తీసుకుని, రాము కళ్లలోకి చూస్తూ ....
శైలజ : రాము ... నీకు గుర్తుందా…. 25 సంవత్సరాల క్రితం,. కావాలని నేను నీ వెంటపడి, వెంటపడి విసిగించే దానిని. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఏమీ అనకుండా, ఓపిక గా ఉండేవాడివి. అదే నీ లో నాకు బాగా నచ్చేది.
రాము : ఇప్పుడు, ఆ విషయాలు ఎందుకు…. చెప్పు.
శైలజ : నేనే … నీ అమాయకత్వం చూసి ప్రేమించాను. ఆ ప్రేమ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది రాము…. అంటూ రాము భుజం పై వాలింది.
రాము : ఇప్పుడు ఏమైంది…. మనం సంతోషంగా నే ఉన్నాం కదా…
శైలజ : మనం సంతోషంగా ఉన్నామా…. నిజం చెప్పు…. నువ్వు ఉన్నావా…
రాము : శైలు…. నువ్వు అనవసరం ఏదో మాట్లాడుతున్నావు … నేను సంతోషంగా ఉండడం వల్లనే కదా , ఇంత హోదా, ఆస్తి, బిజినెస్ మేన్ గా పేరు అన్నీ సంపాందించాను. నా సంతోషం లో నువ్వు ఉండ బట్టే కదా, ఇదంతా మన జీవితంలో జరిగింది.
శైలజ : రాము … అప్పుడప్పుడు, కొన్ని సార్లు నీ ముఖం చూసినప్పుడు, నీలో ఏదో లోటు ఉన్నట్టు, నువ్వు ఇంతగా ఇవన్నీ సంపాదించినా సరే, వీటన్నింటికి నువ్వు , ఏ రోజు ఎటాచ్ అయి లేనట్టు అనిపిస్తుంది.
రాము కి శైలజ, ఏదో భావోద్వేగం తో, మాట్లాడుతుందనే విషయం అర్దం అయింది.
వెంటనే
రాము : నవ్వుతూ… శైలు … . అనవసరం గా ఏదో ఆలోచిస్తున్నావు … లే… టైం అవుతుంది … నిన్ను ఇంటి దగ్గర దింపి…. ఆఫీస్ కి వెళతాను…. లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. స్పెషల్స్ చెయ్యి.
రాము ఆఫీస్ కి వెళ్ళగానే, విషయం తెలిసిన ఆఫీస్ స్టాఫ్ …. రాము 25 సంవత్సరాల సంధర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే ఆఫీసులో జాబ్ చేయడం వలన విమల పిల్లలకు కూడా విషయం తెలిసింది.
మధ్యాహ్నం రాము ఇంటికి వచ్చాడు. శైలజ రాము కలిసి లంచ్ చేసిన తర్వాత …. ఇద్దరూ ప్రేమ సాగరం లో ఆనందించారు.
సీన్ – 65.
విమల పిల్లలు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక… రాము 25 సంవత్సరాల పెళ్లి రోజు విషయం, తల్లి తో చెప్పారు.
శైలజ కోరిక మేరకు ఆ రోజు, సాయంత్రం రాము శైలజ కలిసి సినిమా కి వెళ్లారు.
రాము, శైలజా సినిమా చూస్తున్న సమయంలో విమల , శుభాకాంక్షలు తెలియజేయడానికి రాము కి ఫోన్ చేసింది. సినిమా శబ్దం లో విమల మాటలు సరిగా వినపడకపోయినా అర్దం చేసుకొని ధాంక్స్ చెప్పి,. శైలజ కు ఫోన్ ఇచ్చాడు. శైలజ కూడా ధాంక్స్ చెప్పింది. విమల గొంతు వినే సరికి, రాము మనసు లో ఏదో అలజడి గా అనిపించింది. సినిమా పై ఏకాగ్రత చూపలేక పోతున్నాడు.
సినిమా అయిపోయాక రెస్టారెంట్ కి వెళ్లి…. ఇంటికి వెళ్ళారు.
ఆ రోజు రాత్రి శైలజా, రాము ఇద్దరూ ప్రేమ పక్షుల్లా కలిసి ఒకరి కౌగిట్లో మరొకరు వాలి మాట్లాడుకుంటున్నారు.
శైలజ : రాము…. ఈ రోజు చాలా బాగా గడిచింది కదా…. పిల్లలు కూడా మనతో ఉంటే బాగుండేది.
రాము : అవును …. వాళ్లను చాలా మిస్ అయ్యాం.
శైలజ : ఇందాక, సినిమాలో విమల కాల్ చేసింది…. సరిగా వినపడలేదు…. ఒకసారి ఫోన్ చెయ్యండి.
రాము : ఈ సమయంలో అంత అవసరమా…. రేపు మాట్లాడదాం లే.
శైలజ : నేను… ఈ రోజు ఉదయం గుడిలో అడిగిన ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పలేదు…అంటూ రాము గుండెను నిమురుతూ అంది.
రాము : ఒక్కసారిగా, అసహనానికి గురై …. శైలు నువ్వు, ఏం అడగాలి అనుకుంటున్నావో , అది సూటిగా అడుగు. సమాధానం చెపుతాను… అంటూ…. కొంత కోపం గా…. కొంత భాధగా…. అవును, నేను సంతోషాన్ని అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. చెప్పాలంటే నాకు అర్దం కాదు. చిన్న తనం నుంచి సమస్యలు, కష్టాలు, ఆకలి బాధలు, ధీన పరిస్థితులు, ప్రేమ వెక్కిరింపు ఇవే మనసు లో నాటుకు పోయి ఉండడం వలన నేను భావోద్వేగాలకు చలనం లేని మనిషి గా అయిపోయాను. ఈ స్థితి కి ఎవరూ కారణం కాదు. నాతో ఉన్న వారు సంతోషంగా ఉంటే, వారిని చూసి నాకు సంతోషం ఆ క్షణంలో అనిపిస్తుంది. అలా అని నేను ఏ విధంగా ను భాధతో, వెలితి తో జీవితం గడపడం లేదు. ఇది నిజం.
శైలజ : వెంటనే …. సారీ… సారీ … రాము…. నిన్ను భాధ పెట్టాను…. సారీ….. నీ కోసం నేను ఎప్పుడూ ఏం చేసింది లేదు…. నా కోసం నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. సంతోషం, ప్రేమ , పంచావు. అడిగిన వన్నీ ఇచ్చావు.
రాము : ఇప్పుడు… మనకు ఇదంతా అవసరమా…. నువ్వు అనవసరంగా ఎక్కువ గా, ఏదీ ఆలోచించకు.
కానీ రాము కి అర్దం అవుతుంది. విమల పై తనకున్న ప్రేమ విఫలం కావడంతో తాను సంతోషంగా లేననుకొని … శైలు భావిస్తుంది అని అనుకున్నాడు.
నిజానికి శైలజ ఉద్దేశం కూడా అదే … ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఆ మనిషి తో జీవితం గడపని పక్షంలో మనసు పడే బాధ ఎలా ఉంటుందో …. శైలు కి రాము ను ప్రేమించే సమయం లో బాగా అర్దం అయింది. రాము కనుక తనను పెళ్లి చేసుకోక పోతే, జీవితాంతం అలాగే ఉండి పోవాలని శైలజ అనుకుంది. …. మరి రాము కి కూడా తన లాగే విమల విషయం లో ఉంటుంది కదా, అనే ఆలోచన రాను, రాను రోజులు గడిచే కొద్దీ శైలజకి తెలిసొచ్చింది. ముఖ్యం గా విమలను చూసాకా, శైలజ లో ఆ భావం మరీ ఎక్కువగా అయింది. …. అందు కోసం త్యాగానికి సిద్ధపడాలని అనుకుంది. కానీ అది తప్పా ఒప్పా అనేది శైలజ కు తెలియదు.
సీన్ – 66
ఒక వారం తరువాత శైలజ ఫోన్ చేసి , విమల ఇంటికి వెళ్ళింది. శైలజ రావడం తోనే విమల సంతోషంగా ఆహ్వానించింది…. మీతో పాటు రాము వస్తే బాగుండును అంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటున్నారు.
కొంత సమయం తర్వాత…
శైలజ : విమల … నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా భావించవు కదా….
విమల : అయ్యా … ఎంత మాట…. పర్వాలేదు… నాకు మీరు తప్పితే ఎవరున్నారు … నా మంచి కోరేవారు …. అడగండి.
శైలజ : కొంచెం తడబడుతూ, విమలా …. నువ్వు మరలా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది …. ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దు …. ఎందుకంటే , నీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుందని అన్నాను.
శైలజ మనసు లో కొంత భయం తోనే అడిగింది.. విమల ఏమనుకుంటుందో అని.
విమల : ఒక్కసారిగా నవ్వింది…. పెళ్లా … నేనా…. ఈ వయసు లో…. ఎవరు చేసుకుంటారు చెప్పు …. నా లో ఏం ఉందని చెప్పు…. నేను ఇద్దరు పిల్లల తల్లి ని …. అని నవ్వుతూ అంది. …..
శైలజ అడిగిన ప్రశ్నకు విమలకి కోపం రాలేదు… కానీ ఆశ్చర్యం అనిపించింది.
శైలజ : అదేంటి… విమలా, నీకు చక్కటి వర్చస్సు ఉంది, మంచి మనసు ఉంది.
విమల : అవును …. ఇవన్నీ ఉండడం వల్లనేమో , భగవంతుడు ఈ రాత రాసాడు నాకు ….. అయినా జీవితం లో ప్రేమ, పెళ్లి అనేవి రెండు కూడా ఒక్కసారే ఉండాలి … ఈ రెండింటి లోనూ ఇప్పటికే, చిన్న వయసు లోనే ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి.
ఒకరితో ప్రేమ పొందినా , పెళ్లి జరగని నరకం ఎలా ఉంటుందో చూసాను … మరొకరి తో పెళ్లి జరిగినా ప్రేమ పొందని జీవితం చూసాను. … ఇప్పుడు మరలా వీటన్నింటికి అతీతం గా పెళ్లి చేసుకుని ఏం సాధించాలి …. చెప్పు శైలజ. అయినా నాకు నువ్వు, రాము ఉన్నారు కదా చూసుకోవడానికి.
శైలజ : వెంటనే …. అదే…. అదే…. నేను అనేది…. నీకు రాము అంటే ఇష్టం కదా…. రా...ము…ని…. పెళ్లి చేసుకో గలవా అని ….
నిశ్శబ్దం గా ఉంది… ఆ సమయం.
శైలజ అన్న మాటకు విమల విస్తు పోయింది. ఊహించ లేదు సరికదా…. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.
కొంత సమయం తర్వాత …
విమల : చూడు శైలజ …. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇంత త్యాగం తో మాట్లాడతావని ఊహించ లేదు. బహుశా ఇది, నీకు రాము పై ఉన్న అతి ప్రేమ ఇలా మాట్లాడిస్తుంది. ….. నాకు రాము అంటే ప్రేమ ఉంది. కానీ అది ఒకప్పటిలా ఉన్న ప్రేమ మాత్రం కాదు. ఇప్పుడు ఉన్న ప్రేమలో రాము ఎంతో , నువ్వు అంతే నాకు …. అప్పట్లో రాము మనసు మాత్రమే కావాలనుకునే దానిని. కానీ ఇప్పుడు రాము మనసు తో ముడిపడి ఉన్న మనసులు కూడా కావాలని ఆశిస్తున్నాను. అది నాకు ఇప్పటికే లభించింది. నా వలన రాము కి ఏ సమస్యా, ఎప్పుడూ ఉండదు.
ఇక రెండవ విషయం , రాము నుంచి ఆశించేది ఒకటే …. జీవం వెళ్లే వరకు మానసిక సహాయం మాత్రమే. రాము ఎప్పుడూ కూడా కడిగిన ముత్యం. ఆ విషయం నాకు చదువుకునే రోజుల్లోనే తెలుసు.
దయచేసి ఈ విషయం ఎప్పుడూ మన మధ్య వద్ధు… అంది విమల.
విమల విశాలమైన మనసు కి గర్వపడింది శైలజ.
మనసు లో ఇలా అనుకుంది …. నువ్వు కడిగిన ముత్యం.
కొంత సమయం తర్వాత…
శైలజ : విమల … ఈ విషయం రాము తో అనకు.
విమల : వెంటనే శైలజ చేయి తీసుకుని చిన్నగా ముద్దాడుతూ…. నా పిల్లలు తో పాటు, మీరు ఇద్దరూ చాలు నాకు ఈ జీవితానికి. అంది
శైలజ ఇంటికి బయలు దేరింది.
మిగిలినది
ఎపిసోడ్ – 19 లో
యడ్ల శ్రీనివాసరావు
30 June 2024 , 10:00 PM
No comments:
Post a Comment