తలపు – వలపు
• తర తరమున తరించిన
తరగలేదు శివుని తలపు.
• యగ యుగమున ఎదురేగిన
ఎరుగలేదు శివుని వలపు.
• అంతరమున
అమరమై ఉంది శివ నామం.
• ఊహనమున
ఉపమానమై ఉంది శివ రూపం.
• సంగమ యుగమున
మేలుకొలిపాడు శివుడు...
• ముల్లు లాంటి నన్ను
పూవు గ చేస్తున్నాడు.
• మన్ను లాంటి నన్ను
మణి గావిస్తున్నాడు.
• తర తరమున తరించిన
తరగలేదు శివుని తలపు.
• యగ యుగమున ఎదురేగిన
ఎరుగలేదు శివుని వలపు.
• స్మరిస్తున్న స్మృతులు
మనసు లోని అనుభూతులు.
• లిఖిస్తున్న భావనలు
ఆత్మ లోని అనుభవాలు.
• నా మాటలో శివుడుంటే అది అమృతం.
నా బాట లో విభుడుంటే అది గమ్యం.
ఎదురేగిన = ఎంత వెతికినా
వలపు = ప్రేమ.
ఉపమానము = పోలిక, సాదృశ్యము
సంగమ యుగం = కలికాలం అంత్య దశ నుంచి సత్య యుగం ఆరంభ సమయం.
యడ్ల శ్రీనివాసరావు 30 July 2024, 10:00 pm.
No comments:
Post a Comment