అంతరంగికుడు
• అంతరంగం లో సఖుడా
ఆనందం నింపేటి విభుడా.
• పరవశం లో ఘనుడా
ప్రేమ నింపేటి శివుడా.
• ఏమి చెప్పగలను
ఏమి రాయగలను.
• పొందేటి నీ శక్తి దివ్యం
ఇచ్ఛేటి నీ యుక్తి అద్వితీయం.
• శివుడు అంటే శిరమున ఆశీనుడని
హరుడు అంటే దేహమున ఆరా యని.
• ఏమి చెప్పగలను
ఏమి రాయగలను.
• అంతరంగం లో సఖుడా
ఆనందం నింపేటి విభుడా.
• పరవశం లో ఘనుడా
ప్రేమ నింపేటి శివుడా.
• నిను ఆకళింపు కి నా మనసు ఏ పాటిది
నీ జ్ఞానస్తుతి కి నా భాగ్యం ఏ నాటిది.
• పిలిచిన పలుకుతావు.
• నా కష్టము …. నా కష్టము
చూడలేక …. వెన్నంటి ఉంటావు.
• మాయ తెచ్చే ముప్పు తెలియ చేస్తావు
మాయ రూపు రేఖలను వర్ణించి చెపుతావు.
• అంతరంగం లో సఖుడా
ఆనందం నింపేటి విభుడా.
• పరవశం లో ఘనుడా
ప్రేమ నింపేటి శివుడా.
• ఎంతని చెప్పగలను
ఏన్నేళ్లని రాయగలను.
యడ్ల శ్రీనివాసరావు 11 July 2024 ,9:00pm
No comments:
Post a Comment