గురు పౌర్ణమి
• మానవుడా ఓ మానవుడా
అంధకారంలో చిక్కుకున్న అజ్ఞానుడా.
• గురువు అంటే ఎవరు …
సద్గురువు అంటే ఎవరు …
• నీ వెవరో నీకు తెలియజేసేది గురువు
నీ గమ్యానికి దారి చూపేది సద్గురువు.
• గురువు అంటే జీవాత్మ
సద్గురువు అంటే పరమాత్మ.
• మానవుడా ఓ మానవుడా
అంధకారంలో చిక్కుకున్న అజ్ఞానుడా.
• గురువు అంటే ఎవరు
సద్గురువు అంటే ఎవరు.
• గురువు లేని జీవితం
చుక్కాని లేని నావ లాంటిది.
• సద్గురువును నోచుకోని జన్మము
జన్మాంతరాలు చేసిన పాపము.
• నీ జీవితం ఓ నాటకం.
దేహం తో పోషించేది పాత్ర మాత్రమే.
• నీ కర్మలు బహు గుహ్యం.
సద్గతి ని తెలియజేసేది గురువు మాత్రమే.
• నీ జన్మము ఓ కారకం.
జన్మల రహస్యం సాక్షాత్కరించేది సద్గురువు.
• మానవుడా ఓ మానవుడా.
మాయలో మునిగిన అజ్ఞానుడా.
• గురువుని తెలుసు కో.
జ్ఞానమనే పౌర్ణమి వెలుగుని నింపుకో .
• సద్గురువు ని చేరు కో
మోక్షమ నే స్థితిని సాధించుకో.
🙏 🙏 🙏
• ఓం శ్రీ గురుభ్యోనమః.
గురు బీజ మంత్రం:
• ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురువే నమః
• గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
ఓం శాంతి ☮️
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 20 July 2021. 9:00PM.
No comments:
Post a Comment