గుల్మోహర్ పుష్పం
• ముసుగు కమ్మిన ముసురు లో
ఓ చినుకు జారింది …
• జారే ఆ చినుకు
గుల్మోహర్ ను తాకింది.
• ఊగే ఆ గుల్మోహర్ కి
జడి వలపు తగిలింది.
• సిగ్గు పడలేదు కానీ …
గ్రీష్మం లో గంధర్వ మైంది గుల్మోహర్.
• తగ్గి ఉండలేదు కానీ …
వర్షం లో విర పూసింది గుల్మోహర్.
• ముసుగు కమ్మిన ముసురు లో
ఓ చినుకు జారింది …
• జారే ఆ చినుకు
గుల్మోహర్ ను తాకింది.
• ఊగే ఆ గుల్మోహర్ కి
జడి వలపు తగిలింది.
• ఎరుపెక్కిన కెంప ల్లే
వెదజల్లే సున్నిత సుగంధం.
• పెనవేసిన పందిరై
పరిచెను సుందర మనోహరం.
• ప్రకృతి పాటవం లో
ఇది ఓ అద్బుతం.
• మనసు రంజనం లో
ఇది అతి సహజం.
• వేకువ బాటలో
పూలు వేసెను పానుపు.
• బాల్యపు ఆటలో
జాలు వీడలే ఆ జ్ఞాపకం.
• ముసుగు కమ్మిన ముసురు లో
ఓ చినుకు జారింది …
• జారే ఆ చినుకు
గుల్మోహర్ ని తాకింది.
• ఊగే ఆ గుల్మోహర్ కి
జడి వలపు తగిలింది.
• సిగ్గు పడలేదు కానీ ...
గ్రీష్మం లో గంధర్వ మైంది గుల్మోహర్.
• తగ్గి ఉండలేదు కానీ ...
వర్షం లో విర పూసింది గుల్మోహర్.
జడి = వాన
గంధర్వం = వనప్రియం
పాటవం = నైపుణ్యం
వేకువ = ఉదయం
జాలు వీడలే = మరచి పోలే
యడ్ల శ్రీనివాసరావు 21 July 2024, 10:15 pm.
No comments:
Post a Comment