మైత్రి మాధుర్యం
• కలిగే భావం లో
మెదిలే నీ రూపం శివ
• చూసే తారల్లో
మెరిసే నీ వదనం శివ
• నీ వెంట నేనుంటే
రాత రాత లో ఎన్నో సత్యాలు.
• విలువలు లేని స్నేహా బంధాలు
మోహ ల దాహ ల వ్యర్థాలు.
• నీతులు చెపుతారు కానీ
ఆచరించ లేరు అల్పులు.
• మిత్ర బృందాల కాలక్షేపాలు
కడలి లో కలిసే కాలగర్భంలో.
• కలిగే భావం లో
మెదిలే నీ రూపం శివ
• చూసే తారల్లో
మెరిసే నీ వదనం శివ
• నా తోడు నీవుంటే
మాట మాట లో ఎన్నో సత్యాలు.
• స్నేహ సాంగత్యాలు
అద్భుతమైన నటనలు.
• ఆత్మ వంచకులకు
అవి ఆనంద నిలయాలు.
• కామపిశాచాల మాటలు
అర్భకుల కు వినసొంపు స్తోత్రాలు.
• మైత్రి అనే మైకం లో
వికారాల బురద ఓ మాధుర్యం.
• కలిగే భావం లో
మెదిలే నీ రూపం శివ
• చూసే తారల్లో
మెరిసే నీ వదనం శివ
• నీ వెంట నేనుంటే
రాత రాత లో ఎన్నో సత్యాలు.
• నా తోడు నీవుంటే
మాట మాట లో ఎన్నో సత్యాలు.
అల్పులు = అస్థిత్వం కలిగిన వారు
అర్భకులు = బుద్ధి హీనత కలిగిన వారు.
యడ్ల శ్రీనివాసరావు 17 July 2024 , 6:00 pm.
No comments:
Post a Comment