సద్గురువు
• గురువు లెందరో ఉన్నా
సద్గురువు మాత్రం ఒక్కడే.
• గురువు లెందరో ఉన్నా
సద్గురువు మాత్రం ఒక్కడే.
• అతడే తండ్రి …. అతడే తల్లి
అతడే దైవం .… అతడే శివుడు.
అతడే సద్గురువు.
• సత్య జ్ఞానము బోధిస్తూ
మార్గ దర్శకం చేస్తాడు.
• జన్మ కారకం చూపిస్తూ
అనుభవాలను ఇస్తాడు.
• గురువు లెందరో ఉన్నా
సద్గురువు మాత్రం ఒక్కడే.
• అతడే శివుడు
అతడే పరమాత్ముడు.
• నిరాకార శివుడు ఈ సంగమాన
బ్రహ్మ తనువు లో అవతరించెను.
• సృష్టి ఆదిమధ్యాంతాల
నాటకం చెప్పెను.
• ఆర్తనాదాల పిల్లలకు
ఆత్మ స్వరూపం చూపెను.
• విశ్వ కళ్యాణానికై జ్ఞానబోధను చేసెను.
• అదియే నేటి మౌంట్ అబూ లో మధువనం.
ప్రజాపిత బ్రహ్మ కుమారీస్
ఈశ్వరీయ ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం.
• గురువు లెందరో ఉన్నా
సద్గురువు మాత్రం ఒక్కడే.
• అతడే తండ్రి …. అతడే తల్లి
అతడే దైవం .… అతడే శివుడు.
అతడే సద్గురువు.
సంగమం :
కలియుగం ముగిసి సత్య యుగం ఆరంభం అయ్యే మధ్య నున్న ఈ ప్రస్తుత కాలం.
ఆదిమధ్యాంతాలు :
సృష్టి మొదలు, సృష్టి మధ్యమం, సృష్టి అంతం.
ఓం శాంతి ☮️
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 19 July 2024, 7:00 PM.
No comments:
Post a Comment