Wednesday, March 2, 2022

138. ఓ మనిషి…ఓ మనసా

 

ఓ మనిషి…ఓ మనసా

• ఓ మనిషి….ఓ మనసా

• ఓ మనిషి….ఓ మనసా

• ఎంతెంతో వెతికావు…

• ఏడేడో చూసావు…

• ఏదేదో చేసావు. 

• గుప్పెడంత మనసు కోసం…

• చక్కనైన చుక్క కోసం.


• ఓ మనిషి…ఓ మనసా

• వసంతాలు గడిచాయి….

• వలపు లే విరిసాయి.


• మనువులే అయ్యాయి….

• మనసు లే తెరుచుకున్నాయి.


• ఈ రంగుల ప్రపంచమే…..

• రణరంగం అని తెలియలేదు.

• మనసు కు రంగు ఎలా వెయ్యాలో…

• ఎవరూ నేర్పించ లేదు.


• ఓ మనిషి….ఓ మనసా

• ఓ మనిషి….ఓ మనసా

• ఎంతెంతో వెతికావు…

• ఏడేడో  చూసావు…

• ఏదేదో చేసావు.

• గుప్పెడంత మనసు కోసం…

• చక్కనైన చుక్క కోసం.


• కాలం సాగుతూ ఉంది…

• బుతువులు మారుతూ ఉన్నాయి.

• ఆకాశం లో చుక్కలు….

• అన్నీ మెరుస్తూ ఉన్నాయి.

• ఆ చుక్కల వెలుగు….

• నా తనువును తాకుతుంది... కానీ

• నా మనసును  తాకడం లేదు.


• నా జీవన చుక్క…..

• ఎప్పటికైనా మెరిసేనా…

• నా లో చీకటిని చీల్చే నా…

• వెలుగు తెచ్చే నా...

• నా మనసు లో వెన్నెల నింపే నా…

• ఎన్నటికీ…. అది ఎప్పటికీ.



• ఓ మనిషి…ఓ మనసా

• ఓ మనిషి…ఓ మనసా.


• మనిషి అంటే మనుగడకు….

• అవసరమయ్యే సాధనమని.

• మనసు అంటే మాయ అని….

• మనిషి అంటే స్వార్దం అని...‌

• తెలియలేదే...

• ఈ మనిషి కి తెలియలేదు.

• ఈ గుప్పెడంత మనసు కు తెలియరాలేదు.


• ఓ మనిషి…ఓ మనసా

• ఇంద్ర ధనుస్సు లో ఏడు రంగులు చూసి…

• వెలిగే చుక్కలు కూడా సంబరపడుతున్నాయి.

• నా జీవన ఉషస్సులో....

• అన్ని రంగులు లేనందునే నా….

• నా చుక్క చీకటినిస్తుంది.


• ఓ మనిషి…ఓ మనసా

• ఓ మనిషి…ఓ మనసా

• ఎంతెంతో  వెతికావు…

• ఏడేడో చూసావు…

• ఏదేదో చేసావు.

• గుప్పెడంత మనసు కోసం…

• చక్కనైన చుక్క కోసం.


యడ్ల శ్రీనివాసరావు. 1 మార్చి 2022…11:00 pm.



No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...