తారామృతము
• ఆశ కలిగెనే…
• ఆశ కలిగెనే…
• అందమైన తారపై...
• ఆశయే కలిగెనే.
• తార లోని తళకులకు…..
• నా తరంగాలు మెలి తిరిగె నే.
• నా హృదయ అంతరంగం…..
• తార తలంపుతో తలుపులు తెరిచెనే.
• నా అంతరంగము లో తన అందమును….
• చూసి తార ఎంతో పరవశించెనే….
• తార మనసు ఎంతో వికసించెనే.
• వికసించిన తార పై….
• నే తపన ఎంత చెందెనో….
• నా తనువు ఎంత తల్లడిల్లెనో.
• నే చేతులెంత చాచినా….
• చామంతులెన్ని విసిరినా....
• తారా తీరమును నే చేరలే.…
• తార దరికి నను చేరనీయ లే.
• తార తళుకు నను తాకుతునే ఉంది….
• నా లో ప్రేమను పెంచుతునే ఉంది.
• తార కంట నీరు.….
• కన్నీరై…మున్నీరై…..
• జాలు వారుతుంది….
• నా దోసిలి లో చేరుతుంది.
• దోసిట నీరు…అమృతమై….
• నా జీవామృతం అవుతూ ఉంటే.
• ఇక తార నుంచి నే ఆశించేదేమి…..
• తారకు నే నివ్వగలిగేదేమి.
• తార ఉన్నది నింగి లోన….
• నేనున్నది నేల పైన.
యడ్ల శ్రీనివాసరావు, 11:45 pm , 13 March 2022.
No comments:
Post a Comment