జీవన శూన్యం
ఇటీవల బంధువుల అబ్బాయి చేసుకున్న అంశం, నా పై విపరీతమైన ప్రభావం చూపించింది. చిన్న వయసులోనే ఇలా జరగడం ఎవరికైనా చాలా బాధాకరం. బహుశా కొంతమంది కి , తమ జీవితకాలంలో ఏదొక వయసు లో, ఏదొక సమయం లో, ఏదొక సమస్య వలన, జీవించడానికి తనకున్న శక్తి సరిపోక ఇటువంటి ఆలోచన కలుగుతుందేమో ….. అటువంటి వారికి అంకితమిస్తూ 🙏…. ఇది చదివిన వారికి , ఇసుక రేణువంత మార్పు ఆలోచన లో రాక పోతుందా…. అనే ఆశతో …పరమేశ్వరుడు రాయి స్తున్న రచన ఇది.🙏
• రెండు పదులు నిండకనే…
• నీ రెండు కాళ్ళుకు రెక్కలు వచ్చేనా.
• ఎందుకంత ఆరాటం…
• ఎందుకంత ఆవేశం.
• తమ ఊపిరి నే నీ రూపం గా జీవిస్తున్న…
• నీ తల్లి తండ్రులకు నీ విచ్చిన బహుమానం పేరు కడుపు కోత.
• ఏం….ఏమంత బరువై పోయింది ఈ లోకం నీకు.
• నీ పిరికి తనం తో నిను నమ్ముకున్న వారిని…
• పిరికి వారిగా చెయ్యాలనుకున్నావా….
• లేక పిచ్చివారిగా చూడాలనుకున్నావా
• నీ మనసు లో గుప్పెడంత బాధని భరించలేని వాడివి…
• బండెడంత శోకం తో నీ శరీరాన్ని ఎందుకు హింసించుకున్నావు.
• భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కాలరాసే హక్కు నీకెక్కడిది..
• ఆత్మ ను సంరక్షించు కోవాలిసింది పోయి ఆత్మను హత్య చేస్తావా…
• హత్య చేసే హక్కు నీ కెక్కడిది.
• కూడు గూడు లేని చిన్న చిన్న పక్షులు కూడా ప్రకృతి తో పోరాటం చేస్తూ ఆహారం కోసం ఆనందంగా, ధైర్యంగా తిరుగుతూ ఉంటాయి…
• చిన్న పక్షి సరి సాటిది కాదా నీ జీవితం.
• నేటి లోకం లో ఏ మనిషైనా బ్రతాకాలంటే….బ్రతుకుతూ ఉండాలి అంటే…
• బాధలే బంగారం…
• అవమానాలే అందం…
• ఛీత్కారాలు చప్పట్లు…
• ధృడంగా నిలబడాలి అంటే వీటిని ప్రేమించడం నేర్చుకో…
• ఒకరికి మానసికంగా భయపడుతూ ఉంటే….
• నీ వెనుక దాగి ఉన్న వెన్ను కూడా నిన్ను చూసి చీదరించుకుంటుంది.
• ధైర్యం తో బ్రతకడం నేర్చుకో….
• బ్రతుకుతూ నలుగురిలో ధైర్యం నింపడం తెలుసుకో.
• నువ్వేంటో ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలి అంటే ధైర్యంగా నిలబడాలని తెలుసుకో….నీ కంటూ రాబోయే కాలం కోసం ఓర్పు సహనం తో ఎదురు చూడు.
• ఈ సృష్టి లో పగలు రాత్రి, చీకటి వెలుగు ల ప్రాముఖ్యత సరి సమానము…
• మానవ జన్మ లో సంతోషం దుఃఖం, కలిమి లేమి కూడా సరి సమానమే.
• ఆత్మతో చూడు నీ వారు అందరు నీ కోసం ఎలా తపిస్తున్నారో….
• అయినా చూసి ఇప్పుడేం చెయ్యగలవు నీకు శరీరం లేదు కదా.
• ఎవరో ఏదో అన్నారని…
• అనుకున్నది జరగలేదని…
• ప్రేమలు సఫలం కాలేదని…
• అప్పులు తీర్చలేక పోయామని…
• పరీక్షలు ఫెయిల్ అయ్యామని…
• ప్రతీది ఒక సమస్య గా అనుకుంటే…
• నీ పుట్టుకకు అర్దం ఏముంది.
• ఒకసారి ఆకాశం వైపు చూడు , దాని వైశాల్యం లెక్క గట్టగలవా….
• నీ ఆలోచన కూడా ఆకాశమంతా విశాలంగా ఉంటే నీ లో ఉన్న సమస్య నీకు దుఃఖం కలిగించదు. సరికదా పరిష్కారం చూపిస్తుంది.
• కష్టానికి, సుఖానికి…పాపానికి, పుణ్యానికి నీ కంటు ఒక సరియైన తోడు పెట్టుకో…ఆ తోడుకు పేరు అంటూ ఉండక్కర్లేదు…. కేవలం నమ్మకం ఉంటే చాలు.
• మాసిన బట్టలు విప్పినంత సులువు కాదు …శరీరం విడిచిపెట్టడం.
• చనిపోవాలని నీకు బలంగా అనిపిస్తుంది అంటే….ఆ క్షణాలు, ఆ సమయం, ఆ రోజు నీది కాదు.
• ఒంటరితనాన్ని వదిలి పెట్టి , నీ తోడు తో కాలక్షేపం చెయ్యి….
• నీ వైన క్షణాలు, నీ దైన సమయం, నీ దైన రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాలక్షేమాన్ని ఇస్తాయి.
యడ్ల శ్రీనివాసరావు 29 మార్చి 2022 12:30 pm.
No comments:
Post a Comment