అక్క – సోదరి – సహోదరి
• అక్క అంటూ ఉంటే
నాకంటూ ఉంటే.
• అక్క అంటూ ఉంటే
నాకంటూ తోడుంటే.
• నే వేసే అడుగుకు
నీడై నను తాకేది .
• అక్క అంటూ ఉంటే
బాల్యమే గారం అయ్యే
నా బాల్యమే ప్రేమ రాగం అయ్యే.
• అన్నా చెల్లెళ్ల ... అక్కా తమ్ముళ్ల బంధం
ఎంత బలమో బాల్యానికి ఎరుక
ఒక్క బాల్యానికే ఎరుక.
• అక్కా ...
మన రూపం వేరయినా
మన వర్ణం వేరయినా
మన భేదం వేరయినా
మన రక్తంలో నే ఉన్నారు...
• అమ్మ నాన్నలు ఉన్నారు...
సజీవ మై పెనవేసుకొని ఉన్నారు.
• సోదరి అంటే సహా దరి అని ...
సహా దరి అంటే వెన్నంటి ఉండెడిది అని.
• సోదరి అంటే సహా ఉదరి అని …
సహా ఉదరి అంటే హృదయమునకు తోడు అని.
• ఎవరికి తెలుసు ఎందరికి తెలుసు.
ఎవరు లేని నాకే ఎందుకు తెలుసు.
• అక్క అంటూ ఉంటే
నాకంటూ ఉంటే
• నేలన ప్రాకే వయసు న
నా చేతికి చెయ్యందిస్తావు.
• అమ్మ కాని అమ్మ వై
అమ్మను నీలో చూపిస్తావు.
• అమ్మ లేని నాడు తుదకు
అమ్మ వే అవుతావు.
• నాకు అమ్మ వే అవుతావు.
• అమ్మానాన్నల సంతోషాలకు
ప్రతి రూపాలుగా మనమై ఉంటే.
• మన లోని సంతోషాలకు
మన బాల్యమే నిదర్శనము.
• నాటి మన బాల్యము నేడు లేదు
కానీ,
నాటి సంతోషం నేడు మనలో ఉందా.
• అమ్మ నాన్నలు ఉన్నారు
మన రక్తం లో ఇంకా జీవిస్తూ ఉన్నారు
• మనం ఉన్నంత వరకు
మనతో నే మనలో నే ఉంటారు … కద అక్కా.
• అక్క అంటూ ఉంటే
నాకంటూ ఉంటే.
• అక్క అంటూ ఉంటే
నాకంటూ తోడుంటే
• నా జీవితమే బంగారం అయ్యే
ప్రేమ గారం అయ్యే.
• ఎన్ని బంధములు తోడై ఉన్న
రక్త సంబంధము ఒక సాక్షిభూతం.
యడ్ల శ్రీనివాసరావు 25 మార్చి 2022 , 11:00 pm.
No comments:
Post a Comment