విరజాబిలి
• చూస్తున్నా…చూస్తున్నా…
• నిను చూస్తూనే ఉన్నా.
• నీవెంత దూరమేగినా చూస్తూనే ఉన్నా
• నీవెంత మౌనమేగినా చూస్తూనే ఉన్నా
• నీవు నన్ను చూడకున్నా చూస్తూనే ఉన్నా
• ఈ వెన్నెల వసంతమున దాగి ఉండ గలవా
• ఈ చల్లని మనసున సేద తీరకుండ గలవా
• ఈ అందం నీ కోసం….ఈ చందం నీ కోసం
• ఈ వలపు నీ కోసం….ఈ సొగసు నీ కోసం
• కారు మబ్బులను తెరలుగా ఉంచితే కాన రాననుకున్నావా.
• మనసు భాసను మౌనం గా ఉంచితే వినలే ననుకున్నావా.
• ఈ నిశి రాతిరి కి తెలియదా మన బంధమేమిటో.
• ఈ వెన్నెల కి తెలియదా మన సంబంధమేమిటో.
• మేఘము చాటు నే మసకబారిన…
• నా వెన్నెల నిను తాకక ఉండదు.
• మౌనము మాటు నీ ఊరకుండినా…
• నా లోని వన్నె నీకై చూడక మానదు.
• చూస్తున్నా…చూస్తున్నా…
• నిను చూస్తూనే ఉన్నా.
• నీవెంత దూరమేగినా చూస్తూనే ఉన్నా
• నీవెంత మౌనమేగినా చూస్తూనే ఉన్నా
యడ్ల శ్రీనివాసరావు 12 July 2022, 12:40 AM
No comments:
Post a Comment