హృదయ రాణి
• ఓ వనితా నా అనిత
నీవే నా కవిత.
వలపించావు విలపించావు
మై మరపించావు.
• ఓ వనితా నా అనిత
నీవే నా కవిత.
• నా ప్రేమ పాశం లోని ఆనందిని
గడచిన జన్మమెంతో మధురం.
మన జీవితమంతా సుందరం.
• ఆలుమగలమై ఉన్నాము.
రేయి పగలు ఎరగక ఉన్నాము.
• కధ కై ఒడి లో
సవ్వడి సేసిన సుందరి
ఓ సుందరీ
• కవిత లోని పదము కంటే
నా స్వరము లోని శ్రావ్యమే
నీకు లాలన
• నాకు ఆలన మనకు పాలన.
• నా మాట లోని తరంగాలు
నీ ఎద పొంగుకి లావణ్యమై
• నీ చూపు లోని పిలుపులే
నను కౌగిట్లో ముంచాయి.
• ఓ వనితా నా అనిత
నీవే నా కవిత
వలపించావు విలపించావు మై మరపించావు.
• నీ పెదవి ని తాకిన
నా పదము నలుగుతూనే ఉంది.
• నా మనసు ని చేరిన
నీ రూపము వెలుగుతూనే ఉంది.
• నాటి స్మృతుల నీడలే
నడిపిస్తున్నాయి.
నేటికీ నీ కోసం.
• ఎలా చూసేది నిన్ను
ఎక్కడ వెతికేది నిన్ను
• నా ప్రేమ మిగిలింది
ఈ రాత లో ... విధి రాత లో
• నా మనసు ఉండింది
ఈ భాషలో ... మూగ భాషలో.
యడ్ల శ్రీనివాసరావు 21 July 2022 7:00 pm.
No comments:
Post a Comment