సదా శివ మహేశ్వర
• సదాశివ మహేశ్వర సర్వవిద మహీశ్వర
• సదాశుభ మహేశ్వర సర్వలయ మహీశ్వర
• అంతులేని లోకం లో అనంతమైన రూపాలలో
• ఎన్నెన్నో దేహాలు మరెన్నెన్నో బంధాలు
• బంధాల వలలో నే బ్రతుకు జీవన బాటలు
• బాటలో నడిచేది బ్రతుకు నిండిన మనుషులా
లేక బానిసయిన మనసులా.
• ఏది బంధం…. ఏది సంబంధం
• ఏది అనుబంధం…. ఏది కర్మ బంధం
• సదాశివ మహేశ్వర సర్వవిద మహీశ్వర
• సదాశుభ మహేశ్వర సర్వలయ మహీశ్వర
• బ్రతకలేని మనసులకి బంధాలు ఎందుకో
• బ్రతుకు రాసిన నీకు ఈ ఆటలు ఎందుకో
• ఆడేందుకు మనుషులు ఆట బొమ్మలా
• పాడేందుకు జీవితాలు పాట పదనిస లా.
• సదాశివ మహేశ్వర సర్వవిద మహీశ్వర
• సదాశుభ మహేశ్వర సర్వలయ మహీశ్వర
• బంధం అనే పాత్ర తో కర్మను కొలిచేది ఎందుకు
• సంబంధం అనే నాటకం తో ముడి కలిపేది ఎందుకు
• అనుబంధం అనే మాయలో ముంచేది ఎందుకు
• చివరికి కర్మ బంధాలను బుణానుబంధాలనేది ఎందుకు.
• సదాశివ మహేశ్వర సర్వవిద మహీశ్వర
• సదాశుభ మహేశ్వర సర్వలయ మహీశ్వర
• నీ శిరసున నెలవైన జ్ఞానగంగను జల్లు
• నీ స్మృతి లోని స్థితి తో సద్గతి దొరుకుతుంది.
యడ్ల శ్రీనివాసరావు 29 July 2022 11:30 AM.
సర్వవిద = సకల జ్ఞాన పండితుడు
మహీ = పూజింపబడు
సర్వలయ = సర్వం వినాశనము
No comments:
Post a Comment