చిరునవ్వు
• ఈ నవ్వులే నీ నవ్వులే పువ్వులై పులకరించాయి.
చిరునవ్వులై నా లో చిగురుతొడిగాయి.
• ఆహా ఏమీ ఈ తరుణం
ఆహా ఏమీ ఈ వరుణం.
• నిను తలచి న నిను మరచి న
నీవే నా అదృష్టము.
నీ నవ్వే నా సంతుష్టము.
• నిండు జాబిలి కాన రాలేదు
నగుమోము న నీ నవ్వుని చూసి.
• పండు వెన్నెల జాడ నే లేదు
వెలుగు విరిసిన నీ నవ్వుని చూసి.
• ఈ నవ్వులే నీ నవ్వులే పువ్వులై పలకరించాయి.
చిరు గాలులై నను చిలకరించాయి.
• ఆహా ఏమీ ఈ తరుణం
ఆహా ఏమీ ఈ వరుణం.
• నిను వలచి న నిను విడచి నా
నీవే నా భాగ్యము.
నీ నవ్వే నా సౌభాగ్యము.
• సిరులు కురులుగా సాగే
సిగమోము న నీ చిలకనవ్వును చూసి.
• రతనాలు ఏరులా జారే
పంటి చాటు న నీ చిలిపినవ్వును చూసి.
• ఈ నవ్వులే నీ నవ్వులే పువ్వులై పరవశించాయి.
చిరుజల్లులై నా లో అంకురమైనాయి.
• ఆహా ఏమీ ఈ తరుణం.
ఆహా ఏమీ ఈ వరుణం.
• నిను తలచి నే మరువ ను
నిను వలచి నే విడువ ను.
• నీవే నా సర్వస్వము
నీ నవ్వే నా ప్రాణము.
యడ్ల శ్రీనివాసరావు 31 July 2022 12:30 AM.
No comments:
Post a Comment