స్మృతి లేఖనము
• కన్నులే తెరవక
• నా కను రెప్పలతో రాస్తున్నా
• నీ ఎద పై ఈ లేఖని
• తమకము నే తపన తో తపము లా రాస్తున్నా
• గమకము తో గతము నే తెరిచి చూ పిస్తున్నా
• కన్నులే తెరవక
• నా కను రెప్పలతో రాస్తున్నా
• నీ ఎద పై ఈ లేఖని
• ఎగుడు దిగుడు లెన్ని ఉన్నా
• ఈ అక్షరాల ఒంపులు నీ సొంపులకు తోడు.
• దిగులు గుబులు ఎంత ఉన్నా
• ఈ రాతలోని శ్రావ్యమే నీ ఇంపులకు నీడ.
• నీ కనులకు కనపడని
• ఈ పద కావ్యమును నీ మదిని అడిగి చూడు.
• నిజమో…కాదో.
• నీ ఊహకు అందని
• ఈ రస రమ్యమును నీ తనువు నడిగి చూడు.
• నిజమో…కాదో.
• ఈ పదములు చేసే అల్లరి
• నీ ఎద నీకు చెప్పగలదా.
• ఈ రాతలు చేసే ఉక్కిరిబిక్కిరి
• నీ ఎద నీ శ్వాస కి చేర్చగలదా.
• కన్నులే తెరవక
• నా కను రెప్పలతో రాస్తున్నా
• నీ ఎద పై ఈ లేఖని
• భావము తెలిసాక
• బంధము కలిసాక
• నీ ఎద పైన భారం ఎగసి ఎగసి పడుతుంటే
• నా మది లోన రాగం వగసి సొగసి పోతుంది.
• నేను లేక పోయినా….
• ఈ లేఖనమే జన్మాంతర సాక్ష్యం.
యడ్ల శ్రీనివాసరావు 7 July 2022 ,1:30 AM.
• గుబులు = భయము.
* ఇంపు = ప్రియం, ఇష్టం, ఆనందం, విలాసం, వలపు
• తమకము = ఇష్టము, ప్రేమ, మోహము
• తపన = ఆసక్తి
• తపము = తపస్సు, దృష్టి, ఆలోచన.
• గమకము = నిరూపించిన, మనోజ్ఞము
No comments:
Post a Comment