ఓం నమో నారాయణాయ
• దయ చూపు నా స్వామి….
• దయ చేయు నా స్వామి….
• దరి చేర నీ సన్నిధికి దారి చూపు నా స్వామి.
• వల్లభుడివై
విరిసిన కమలము లో
తేజము తో
నిలిచిన తామరకంటి వాడ.
• కనుసైగన
చిరునవ్వు తో
జగమంత నాటకం
జడి తోన నడుపుతున్నావు.
• మానవ జన్మంటే
మహిమాన్వితము కాదని …
దుఃఖ సాగరం ఈదేటి
జీవన నౌకని తెలిసింది.
• మాయ మర్మము లలో
మునిగిన మెదడు కి
• మోహమే సింహాసనం
కామమే సుఖాసనం.
• దయ చూపు నా స్వామి….
• దయ చేయు నా స్వామి….
• దరి చేర నీ సన్నిధికి దారి చూపు నా స్వామి.
• వేయి పడగల నీడ
వేణువూదేటి వాడ
• పంచ వికారముల
పల్లకీలో పవళించే
పతితులను పావనము చేయు స్వామి.
• కల్ప కల్పముల నుండి
శక్తి హీనమై
మాయకు వశమైన
విగతులము స్వామి.
• జ్ఞాన బిందువు తో
కనులు తెరిపించు స్వామి.
• దయ చూపు నా స్వామి….
• దయ చేయు నా స్వామి….
• దరి చేర నీ సన్నిధి కి దారి చూపు నా స్వామి.
• నారాయణ శబ్దం
నరుల నవనీతానికి అర్దం.
• స్వరము న పలికే మంత్రం
మాధవుని చేరే తంత్రం.
యడ్ల శ్రీనివాసరావు 26 July 2022 5:00 PM.
జడి = నిరంతరం
నవనీతం = చిలికిన తాజా వెన్న
పతిత = భ్రష్టులు, ధర్మం చెడిన వారు.
తంత్రం = దేవతలను చేరే మార్గం.
No comments:
Post a Comment