మౌన తార
• ఆహా… హహహ …. ఓహో… హోహోహో.
గోదావరి తీరం లో ... నడిరేయిన గాలిలో
ఓ తార చెపుతుంది … నిశి రాతిరి వింటోంది.
• ఆకాశం లో
తళుకు బెళుకు తారలు
తహతహతో చూస్తున్నాయి.
• తారల నవ్వులు
దివ్వెలై వికసిస్తున్నాయి.
• చందమామ సాక్షి గా ….
వెలుగు లేని ఒక తార మౌనంగా ఉంది.
• పాలపుంతల చెంతలో ….
నవ్వడమే తెలియక వింతగా చూస్తుంది.
• చీకటి చూపుల భూమి ని
ప్రేమతో చూస్తుంది ఆ తార.
• తన వెలుగుతో రేయి ని
పగలు గ చేయాలని ఆశపడుతోంది.
• ఆహా…ఆహహహ … ఓహో… హోహోహో.
గోదారి తీరం లో … నడిరేయిన గాలిలో
ఓ తార చెపుతుంది ... నిశి రాతిరి వింటోంది.
• వెలుగు లేని ఆ తార
వెలుగు నింపాలని ఓ నాడు
భూమి చేరువ కి పయనం అయింది.
• మౌనమైన ఆ తార
భూమి కెంత దగ్గరైనా
వెలుగే కాన రాలేదు.
• ఆశ విడువని
ఆ తార భూమి పై నిలిచింది.
• వెలుగు నింపలేదని నిరాశ తో ఉంది.
• తారలన్నీ నవ్వుకున్నాయి
మౌన తార అమాయకానికి.
• మౌన తార ప్రేమ ను చూసి
చందమామ నిండు వెన్నెల నింపుతుంది.
భూమిని విడువక తిరుగుతుంది.
• ఆహా…ఆహహహ….ఓహో… హోహోహో.
గోదారి తీరం లో ….. నడిరేయిన గాలిలో.
ఓ తార చెపుతుంది….నిశి రాతిరి వింటోంది.
• ఆ తార ను .... ఆ మౌన తార ను నేనే....
యడ్ల శ్రీనివాసరావు 23 July 2022 12:30 AM.
No comments:
Post a Comment