చిలుక చెలి
• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే
• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే
• చిలకపచ్చ చీరలో చిత్రాంగి చందాన ...
నీ పైట రెప రెప లాడుతుంటే
• చిగురుటాకుల వలె నా చిలిపి ...
కన్నులు టప టప లాడుతున్నాయి.
• చలువ చందనము తో నీ కంఠము శంఖమై ...
ప్రేమ పరిమళం పొదిగి ఉంటే.
• చల్లని గాలులతో ఈ వనమున ...
సుగంధం నింపుతున్నావు.
• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే
• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే.
• దొండపండు లాంటి
నీ ముక్కున మెరిసే ముక్కెర చూసి
• దొరసాని లెక్కన మెదిలే
నీ రూపం నా మదిలో.
• తీగ జాజి వైన జాబిలి
తనివి తీరలేదెందుకో ... నీ పై తపన పోలేదెందుకో.
• శిల్పమంటి నీ సౌందర్యం కింద
శిధిలమై ఉన్నాను.
• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే
• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే
• నీ నెమలి నడకకు
సంపెంగ నడుము హారమై కనిపిస్తుంటే
• వేణు గానాన రాగాలు
నా హృదయాన రేగుతున్నాయి.
• నీ వాలు జడ నిండా మల్లెలు
మురిసి అలసి పోతుంటే
• ఈ రేయి నా మీద వైరమవుతుంది.
ఏమి చేసేది ... ఎవరినడిగేది.
• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే
• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే
యడ్ల శ్రీనివాసరావు 25 July 2022 , 10:45 AM.
No comments:
Post a Comment