విదేశీయుల శివ సాన్నిధ్యం
• 2017 వ సంవత్సరంలో , నేను , నా భార్య మా అబ్బాయి కలిసి అరుణాచలం వెళ్ళాం . ఆ సమయంలో మా అబ్బాయి 8 వ తరగతి చదువుతున్నాడు .
• ఆ రోజు ఆలయం లో శివుని దర్శనం అయిన తరువాత చూస్తే చాలా మంది విదేశీయులు కనిపించారు. అక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము . అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది . ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. ఆశ్రమ ప్రాంగణం లోపల , రమణుల సమాధి వద్ద కొందరు , ఆ ప్రక్కనే ఉన్న శివలింగం ఎదుట అనేక మంది విదేశీ స్ర్తీ లు చీర లో , విదేశీ పురుషులు పైజామా లాల్చీ లో వస్త్రాలు ధరించి లో శివ ధ్యానం చేయడం కనిపించింది. వారిలో ప్రతి ఒక్కరికీ నుదుట కుంకుమ బొట్టు ఉంది . ప్రత్యక్షం గా అదంతా చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది .
• భారతదేశం లో ఉన్న మనం శివుని ఆరాధించడం అనేది మన హిందూ సాంప్రదాయం లో భాగం గా , భక్తి సంస్కృతుల పరంపరలో మనకు సహజంగా అలవడతాయి.
కానీ విదేశీయులు, వివిధ పాశ్చాత్య దేశాల్లో పుట్టి , భిన్న సంస్కృతి సంప్రదాయాల్లో పెరిగిన వారు, అసలు దైవ భక్తి , మన ధర్మం తెలియని వారు , ఇంకా చెప్పాలంటే భారతదేశ మూలాలకు ఏ సంబంధం లేని వారు శివుని పూజించడం , ధ్యానించడం ఏమిటి ? పైగా ఎన్నో సముద్రాలు దాటి ఇంత దూరం అసలు శివుని ఆలయానికి , రమణుల ఆశ్రమానికి ఎలా వస్తారు?. విలాసాల జీవనానికి మొగ్గు చూపించే విదేశీయులు ఇంత నిరాడంబరంగా ఎలా ఉంటున్నారు ? అని ఎన్నో ప్రశ్నలు మనసు లో వచ్చాయి . కానీ సమాధానం దొరకలేదు.
• రమణాశ్రమం లో కాసేపు నేను, నా కుటుంబం తో ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం . మేము బస చేసిన శివ సన్నిధి సత్రం వద్దకు వెళుతూ ఉండగా , అరుణాచలం రోడ్ మీద సైకిళ్ళు తొక్కుతూ కొందరు విదేశీ స్త్రీ పురుషులు చీర, లాల్చీ పైజామా లో కనిపించారు . అలానే మేము నడుస్తూ కొంచెం ముందుకు వస్తుంటే మరి కొందరు విదేశీయులు చెప్పలు లేకుండా నడుచు కుంటూ మాకు ఎదురయ్యారు . వాళ్లు మమ్మల్ని , ఇంకా రోడ్ పై వెళ్లే మరి కొందరిని చాలా ప్రశాంతంగా కళ్లలో కి కళ్లు పెట్టి చూస్తూ , ఓం నమఃశివాయ అంటూ చిరు నవ్వుతో పలకరిస్తూ వెళ్తున్నారు .
• అది చూసిన నాకు, మా అబ్బాయి కి కూడా చాలా వింతగా అనిపించింది. వెంటనే మా అబ్బాయి అడిగాడు, నాన్నా ఫారినర్స్ అంతా లగ్జరీ ఎంజాయ్ మెంట్ , డిఫరెంట్ కల్చర్ లో ఉంటారు కదా, వీళ్లు ఏంటి ఇక్కడ ఇలా మన ఏన్షియంంట్ సేజ్ స్ (పూర్వ కాలం మునులు) వలే జుట్టు పొడవుగా పెంచుకుని ఉన్నారు , అని అడిగాడు. అప్పటికే అవే ఆలోచనలు ప్రశ్నలు నా మనసు లో తిరుగుతూ ఉండడం, వాటికి సమాధానాలు నా వద్ద లేక పోవడం వలన మౌనం గా ఉండి పోయాను .
• ఎవరినైనా ఈ విషయం గురించి అడిగితే సంతృప్తి కరమైన సమాధానం చెప్పలేదు . కానీ అక్కడ ఉన్న కొందరు ఇలా చెప్పారు , విదేశీయులు అనేక మంది ప్రతి సంవత్సరం లో ఆరు లేదా మూడు నెలలు పాటు అరుణాచలం వచ్చి ఆ సమయం అంతా శివాలయం లోను మరియు, రమణాశ్రమం లోనూ ధ్యానం చేస్తూ ఉంటారు , అని చెప్పారు.
• కానీ , మనం భగవంతుని పై సత్యమైన నమ్మకం విశ్వాసం ఉంచినప్పుడు కాస్త ఆలస్యమైనా మనకు తప్పక మనకు కావలసిన సమాధానం , లేదా మనం పొందవలసినవి తప్పక పొందుతాం. ఎందుకంటే ఇది భగవంతుని బాధ్యత.
ఇది నాకు అనేక సందర్భాల్లో, అనేక విషయాలలో నిరూపణ అయింది, ఇంకా నేటికీ అవుతూనే ఉంది, అవసరం లేనివి నా నుంచి ఏదో రూపంలో దూరం అవడం , అవసరం అయ్యేవి మాత్రమే దగ్గరగా ఉండడం శివలీల అనిపిస్తుంది .
• అరుణాచలం లో విదేశీయుల గురించి తలెత్తిన సందేహం మనసులో అలాగే అప్పటి నుంచి మిగిలి పోయింది.
🌹🌹🌹🌹
• 2025 లో సంవత్సరం లో నేను, మా అబ్బాయి కలిసి శివరాత్రి సమయం లో రాజస్థాన్ లో , మౌంట్ అబూ, బ్రహమకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి వెళ్లాము . పది రోజులు అక్కడే ఉన్నాము . శివరాత్రి సమయం లో తండ్రి అయిన పరమాత్మ శివుని తో మిలనం (కలయిక) అత్యంత మనో వైభవంగా మౌంట్ అబూ లో జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా పోర్చుగీసు, డచ్ , రష్యా , అమెరికా , ఆస్ర్టేలియా , ఇండొనేషియా , జపాన్ , ఇరాన్ , ఇలా ఎన్నో వివిధ దేశాల నుంచి వేలాది మంది విదేశీయులు వచ్చి ఉన్నారు . నాకు మరలా అదే ఆశ్చర్యం, అసలు విదేశీయులు ఏంటి , ఇంత దూరం రావడం, వీరంతా శివుని గురించి తెలుసుకోవడం, శివధ్యానం చేయడం వెనుక ఏదో బలమైన సూక్ష్మ రహస్యం ఉంటుంది అని మనసులో అనిపించింది .
• నా ఈ సందేహానికి మౌంట్ అబూ లో ఉండగానే ఆ మరుసటి రోజు నే , శివ పరమాత్ముని గీతా జ్ఞానం క్లాస్ (మురళి) ద్వారా సమాధానం లభించింది . ఆ సమాధానం చాలా అద్భుతంగా , ఆధార భరితంగా , ఈ విధంగా ఉంది .
ఈ సంగమ యుగం లో (కలియుగం అంతం అవుతూ, సత్య యుగం ఆరంభం అయ్యే కాలం) . . . నేను (శివ పరమాత్మ) తిరిగి సత్య యుగ స్థాపన కు భరత భూమి పై వృద్ధ మానవ తనువు లో అవతరిస్తాను .
• ఈ విశ్వం ఆది లో అనగా కల్పం (5000 సంవత్సరాల) క్రితం సత్య యుగం లో ఎవరైతే నా పిల్లలు (ఆత్మలు) , ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో , . . వారంతా జనన మరణ చక్రంలో తిరుగుతూ కాల క్రమేణా వేరు వేరు ధర్మాలలో కి వెళ్లి పోయారు .
బౌద్ధ , క్రిష్టియన్ , ముస్లిం , జైన్ , సిక్కు , ఇలా ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా అనేక ధర్మాలలో కి వెళ్లి ఉన్నారు .
నేను (శివ పరమాత్మ) భూమి పై అవతరించిన ఈ కలియుగాంత సమయం లో , ఈ విశ్వం అంతా నిండి ఉన్న నా పిల్లలు (ఆత్మలు) ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా సరే . . . ఆదిలో సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన నా పిల్లలు (ఆత్మలు) నన్ను వెతుక్కుంటూ వారి మూల స్థానం అయిన ఈ భరత భూమి కి చేరుతారు . తిరిగి నన్ను కలిసి నా ద్వారా రాజయోగం పొందుతారు . అని స్పష్టం గా గీతా జ్ఞానం ద్వారా ఆ రోజు సమాధానం లభించింది . . .
• అప్పుడు నాకు అర్దం అయింది ఒకటే … అరుణాచలం లో నేను చూసిన విదేశీయులు , ఎక్కడో విదేశాలలో క్రిష్టియన్, జోరాస్ట్రియన్ , ఇస్లాం , బౌద్ద ధర్మాలలో నేడు పుట్టినవారు . . . కొన్ని యుగాల క్రితం భారతదేశ సంతతి కి చెందిన వారు . వారు అప్పటిలో శివుని ఆరాధించే వారు . వారు (ఆ ఆత్మలు) జననం మరణం పొందుతూ తమ మూలాలను మరచి , కలియుగం లో వేరు వేరు ధర్మాలలో వివిధ దేశాల లో జన్మించారు .
తిరిగి ఈ కలియుగాంత సమయం లో , శివుడు అవతరించిన ఈ సంగమ యుగం లో , వారంతా తాము పూర్వజులం అనగా ఎన్నో జన్మలు ఎత్తిన వారం అనే విషయాన్ని శివ శక్తి ద్వారా అనేక ఆధారభరిత అనుభవాలను వారు స్వయం గా పొంది , ఒకప్పుడు తాము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని తెలుసుకుని నేడు , భారత దేశం లో ఉన్న ఉన్న శివుని ఆలయాలకు , ఆశ్రమాలకు చేరుకుంటారు . . . చేరు కుంటున్నారు .
• శివుడే స్వయంగా గీతా జ్ఞానం ద్వారా, నా మనసు లోని ఈ సందేహానికి సత్యమైన సమాధానం ఆధారంతో చూపిస్తూ తెలియచేయడం జరిగింది .
ఇలాంటి అనుభవాలు ఎన్నో. . . అందుకే శివుని తో ప్రయాణం అత్యద్భుతం. అది అనేక భవిష్య జన్మలకు కావలసిన భోగ భాగ్యం.
శివుడు అంటే ఒక విశ్వ మహ శక్తి . అంతే కానీ ప్రత్యేకంగా ఒక మతానికి పరిమితం అయిన వాడు కాదు . ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో , ఇరాన్ ప్రజలు శివుని పూజించడం, ప్రార్థనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో లింక్ 👇👇 . వేల సంవత్సరాల క్రితం , ఆ యా దేశాలలో వారు ఉపయోగించిన నాణేల పై శివలింగం ఉండడం గమనించవచ్చు.
1.
https://youtu.be/av-_Ivs6FmY?si=N7JkOD4Fm6ggqmKA
2.
https://youtu.be/y2OAJlCjBGY?si=3qtJxnXrHrwD-nN5
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 30 May 2026 . 9:00 PM .


No comments:
Post a Comment