Thursday, May 21, 2026

747. కది లే కలం

 

కది లే  కలం



• కది లే   కది లే

  కది లే   ఈ  కలము .

• కాలము తో   చేసెను    స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .


• సిరా   లేని    ఈ అక్షరాలు

  సిరులొలికే    సంపదలు .

• అవి పలికే   కంఠ  స్వరాలు

  వెతలు   తరించే   తారలు.


• భారం దించే   ఈ  భావాలు

  విశ్వసేవ కై   వెలసిన   చిరు  దివిటీలు.

• దారిని   చూపే   ఈ రాతలు

  భాగ్య  మనసు లకు   సంపదలు .


• కది లే     కది లే

  కది లే     ఈ కలము

• కాలము తో   చేసెను    స్నేహం 

  చిర కాలముగా   పంచెను   తన భావం .


• కాలం   తెలిపిన   మౌనం తో

  ఈ కలం   చేస్తుంది   తాండవం .

• కాలుడు  చూపిన   సత్యం తో

  ఈ కరం  రాస్తుంది   మైమరచి .


• తాళ   పత్రాలు  కావివి . . . 

  కానీ

  మనసు  తాళం   తెరిచే  సూత్రాలు .

• తెలుగు లోని  తెల్లదనంతో 

  తేటతెల్లం  మవుతున్న

  ఈ తామరలు   శివార్పితాలు  .


• కది లే    కది లే

  కది లే    ఈ కలము

• కాలము తో    చేసెను   స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .



వెతలు = దుఃఖాలు

తరించు = దాటు, అతిక్రమించు

తారలు = ప్రకాశించు నక్షత్రాలు.

తేటతెల్లం = మిక్కిలి స్పష్టం.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2026 10:30 AM.


No comments:

Post a Comment

747. కది లే కలం

  కది లే  కలం • కది లే   కది లే   కది లే   ఈ  కలము . • కాలము తో   చేసెను    స్నేహం .   చిర కాలముగా   పంచెను    తన భావం . • సిరా   లేని  ...