నా కోసం...ఓ మనసు
• సముద్రంలా గంభీరంగా ఉంటావు ...బాధలన్నీ నీలోనే దాచుకుంటావు.
• సెలయేరులా స్వచ్ఛంగా చలాకీగా నీ స్నేహందిస్తావు.
• పర్వతంలా ఉన్నతమైనది నీ వ్యక్తిత్వం….
• ఆకాశంలా నిర్మలమైనది నీ మనసు …..
• ఏ ఉరుములు మెరుపులు నిను తాకలేవు.
• ఎడారిలో పూసిన మంచు పుష్పం నువ్వు….
• వేడిమి నువ్వు భరిస్తూ చల్లదనాన్ని మాకు పంచి ఇస్తావు.
• మంచి గంధానికి చల్లగాలి తోడైనట్టుంటుంది నీ స్నేహపరిమళం.
• ఎన్నో రంగులు... మరెన్నో సుగంధాలతో పూసింది నీ కవితా వనం ...అది అలసిన మా మనసులకు పన్నీటి జల్లు.
• నీ కవితా గుచ్చం లో , ఇది ఒక గడ్డిపువ్వు అనుకో....
May 19 21
No comments:
Post a Comment