కలి మనిషి
· చిత్రమో…. ఇదియే విచిత్రమో…
· ఉషోదయం తో ఉరుకుల
పరుగులిడే ఓ మనిషి.
· చించు … కాస్త ఆలోచించు
నీ నీడ పయనమెటో.
· అరచేతి రేఖల మార్గము
అంతా అగమ్యగోచరం.
· చూసే చూపులు , చేసే చేతలు …
*చించే మనసు వేనా ... నీ మనసు వేనా
అడిగి చూడు మదిని శాంతంగా …
· ఈ గందర *“గోళం” లో
చిందర వందర
ఎవరి
కోసం, ఎందు కోసం..
· మాయ లోని *ధూమం
ఏ అధ్బుతమైనా సృష్టించగలదు,
రంజింప గలదు.
· కాలం *“కలి” ది అయినపుడు,
*మానానికి *మోచనమెక్కడ.
· *అరిషడ్వర్గాలను ఆభరణాలు గా
ఆశ, అత్యాశ ల నడుమ
ఊయల ఊగే మనిషి … ఓ మనిషి.
· కల్తీల కాలగమనంలో
స్వచ్చత
ఎప్పటికి నిరాశే.
· మాయా లోకం లో
ఆహారమే … ఆహర్యము,
బంధువులే … రాబందులు,
శ్రమయే … దోపిడీ,
అనాగరికతే … నాగరికత,
పచ్చనోట్లే … జీవిత కొలమానం.
· అజ్ఞానమే ... జ్ఞానమనుకునే
మిడిసిపాటు
కన్ను మూస్తే నే ... కాని … కానరాదా.
· మనిషి
నీ వొక *మన్ను ...
నీ వొక *ఉదకము ...
నీ వొక *ఉష్ణము ...
నీ వొక *పవనము ...
నీ వొక *శూన్యము ...
అడిగి చూడు నీ మూల కణాన్ని, అవునో … కాదో.
· నీవు ఉన్నా … లేకున్నా,
నీ కోసం ఎవరూ ఆగిపోయేది లేదు.
· ఎంత సాధించిన, ఏమి సాధించిన …
అంతర్యామి యే
నీ ఆఖరి మజిలీ.
· సత్యమెరిగిన మనిషి లో
జ్యోతి ప్రజ్వలన నిరంతరం
దేదీప్యమానం … అదియే *ఆదిదేవుని దీవెన.🙏
చించే= ఆలోచించుట.
గోళం = విశ్వం.
ధూమం = పొగ.
కలి= కలి పురుషుడు
మానం = బుద్ధి, శీలం.
మోచనము = విముక్తి, మోక్షం.
అరిషడ్వర్గాలు
= అంతర్గత శత్రువులు. (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు)
మన్ను= మట్టి.
ఉదకము = నీరు, జలం
ఉష్ణము = నిప్పు, వేడి
పవనము= వాయువు, శ్వాస.
శూన్యము= ఆకాశము.
ఆదిదేవుడు = ఈశ్వరుడు.
యడ్ల శ్రీనివాసరావు 31 May 2021 3:00
pm.
No comments:
Post a Comment