ఏమయ్యావు…. మిత్రమా
·
ఏమయ్యావు మిత్రమా….ఏడున్నావు స్నేహమా…
·
కాలినడక తో కాలేజీ కి చెట్టాపట్టాల్…..కాలక్షేపం తో కాలం తెలియని కబుర్లు.
·
ఆంగ్లం అర్థం కాని ఈ మట్టి బొమ్మకి…..నీ అనువాదం తో ఆనందం గా బుట్ట బొమ్మ ని చేశావు.
·
తెలుగు మాష్టారి(శర్మగారు) పాఠం తదుపరి మిత్రురాలు ఐ. వెంకటలక్ష్మి తో వెటకారాలు, లక్ష్మీ జడ మన బల్ల పై పడితే పెన్ను తో పక్కకు తోసే ఆటలు…. అంతకు మించి జడకు అంటించిన చూయింగ్ గమ్….ఏల మరువను నీ
స్మృతులు.
·
సాయం సమయాన గోదావరి గట్టు పై, చెట్టు చెంత పిట్ట గోడ పై, అల్లరి చేష్టలు….నీ నసీమా(ముస్లిం అమ్మాయి, మా క్లాస్) కోసం నీ ఎదురు చూపులు, మీ ఇద్దరి మౌన వేదనలు…నాకు తొలి ఆనందాలు.
·
అల్లరి కి అర్థం నీవు…ఆ అర్థానికి ధైర్యం నేను…కలబోతయే మన మిత్రబృందం.
·
మన మాటల్లో సంతోషం…మనకు నిత్య యవ్వనం…ఎంతటి కష్టాలైనా కరిగిపోయేవి.
·
కరోనా కలకలంతో , కడలిలా కల్లోలం అయ్యెను మన చెలిమి.
·
చెరగని, చెదరని నీ రూపానికి, నీ ఆలోచనలే జీవం.
·
అలుపెరుగని జీవన ప్రయాణం లో మన దారులు వేరైనా….గమ్యాన్ని చేరడానికి
మరీ ఇంత తొందర ఎందుకు రా నీకు!....
అశృతాంజలి
YSR 31 May 21, 10:00 am
No comments:
Post a Comment