🌹ప్రేమ సత్యం…🧒👧మనిషి నిత్యం…❣️మనసు కృత్యం
·
వేదనా…ఇది ఏ వేదానికి అందని ఆవేదనా.
·
*ప్రణయానికి పరిశీలనే నిలువెత్తు నివేదనా.
·
చూసే చూపులకు
నిట్టూర్పు లే నిరీక్షణ.
·
పలికే పెదవులకు మౌనమే శ్రీ రాగం.
·
ఊగిసలాడే మనసుకి *ఉద్వేగమే ఊరట.
·
వేదనా…ఇది ఏ వేదానికి చెందని మనో వేదనా.
·
పరిమళించే పుష్పానికి ఏమి ఎరుక దాని సుగంధం.
·
మనసు పడే బాధ మనిషికి ఏమి ఎరుక, దాని వేదన.
·
అంతరంగం లోని తరంగాలు తీరం దాటినపుడు కలిసేది *ప్రకృతి లోనే .
·
సుందరమైన స్మృతులు అలంకారాలైనపుడు, జీవనం సజీవం జీవితాంతం.
· ప్రేమ సత్యం…మనిషి నిత్యం..మనసు *కృత్యం
(నిజమైన ప్రేమతో, మనిషి నిత్యం, మనసు కోరుకునేది ఆచరిస్తాడు.)
ప్రణయం = ప్రేమ, స్నేహం, మంచితనం
ఉద్వేగం = మనసు పడే విరహం
ప్రక్రృతి = స్త్రీ, ప్రియురాలు, సృష్టి
కృత్యం = సజావుగా చేయుట
YSR 29 May 21 13:30.
No comments:
Post a Comment