🙏అమ్మకు వందనాలు 🙏
• అమ్మలను కన్న మా అమ్మ ఆనంద రూపిణీ.
• అండ పిండ బ్రహ్మాండమ్ముల క్షేత్ర స్వరూపిణి.
• సృష్టి కి మూలం నీవు.
• ప్రతిసృష్టి కి మూలం నీవు.
• ప్రకృతిలోని పులకరింతలు నీ పరవశానికి ప్రతిరూపాలు ... జగత్ జననీ.
• నిర్జీవాని కి జీవం పోసే వసుధరణివి.
• జీవాన్ని నిర్జీవం చేసే శత్రు సంహారి కాళికవి.
• శక్తికి బీజమైన భైరవి ...నీ దేహమంత ఈ విశ్వంలో అణువంత భాగ్యులం తల్లీ.
• క్షేత్రమున కానరాని దేదమ్మ నీ కంటికి.
• ప్రేమను పంచే పరమేశ్వరి .....కరుణ చూపే కాదంబరి ...లాలించే నీలాంబరి.
• నీ ఆగ్రహానికి భీతిల్లే నీ బిడ్డలం ....నీ అనుగ్రహం తోనే ఊపిరి పోసుకున్నాం.
• మూర్ఖత్వంతో ముదిరిన మా మస్తిష్కాలకి నీ మననం తో మురిపించు తల్లీ... ఓ జ్ఞాన ధాత్రి .
🙏🙏
క్షేత్రము = సమస్తము, విశ్వము, శరీరము.
మస్తిష్కము = మెదడు
మననం = జపించుట, ధ్యానం, పదే పదే తలచుట.
YSR 09 May 21 3:00 pm.
No comments:
Post a Comment