మనసు నినాదం
•ఎన్నో ఆలోచనలు, ఆశల కలబోత మనసు. మనసు కి కావలసినది దొరికే వరకు అలుపు లేకుండా నిరంతరం పరితపిస్తూ నే ఉంటుంది. శరీరానికి నటించడం తెలుసేమో గాని , మనసు కు మాత్రం తెలియదు. ఎందుకంటే మనసు ఒకవేళ పోరపాటున నటించినా క్షోభ అనుభవిస్తూనే ఉంటుంది. ఔనన్నా కాదన్నాఆ విషయం మనసు కు స్పష్టంగా తెలుసు. మనసు సంతోషం, సంత్రృప్తి పడింది అంటే చాలు ఇక అదే మనిషికి జీవిత పరమార్థం.
🌷🌷🌷🌷
• మనిషి లో ఉన్న మనసు కోరుకునే కోరిక పరి విధాల గా, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ధనం, పేరు, కీర్తి, ప్రతిష్ట, సుఖాలు, సంతోషం, గౌరవం, ప్రేమ, మోక్షం, ధర్మం…ఇలా ఉన్న ఎన్నో అంశాలలో, ప్రత్యేకంగా ఏదోఒక అంశం తో ముడి పడి ఉంటుంది. అది మనిషి జన్మించడం తోనే నిర్ణయం అయిపోతుంది. కాని అది మనిషి గ్రహించడానికి , వయసు ,అనుభవం, తన గురించి తాను తెలుసు కునే జ్ఞానం అవసరం.
🌺🌺🌺🌺
• ఇక్కడే ఒక చిత్రం, విచిత్రం దాగి ఉంటుంది. భగవంతుడు ఆడించే ఆటలో , జీవితం లో కొందరికి చాలా సునాయాసంగా , అవలీలగా మనసు కి కావలసినవి దొరుకుతాయి. అది సుక్రృతం.
🌿🌿🌿🌿
• కాని మరికొందరికి ఎంతో ప్రయాస పడితేనేకానీ మనసు కు కావలసింది దక్కదు. ఇది కూడా అద్రుష్టమే. ఇంకొందరికి జీవితాంతం ఎంత ప్రయత్నించినా , మనసు కోరుకున్నది ఎన్నటికీ దొరకదు. ఇటువంటి వారు…హ…ఏం చేస్తాం లే రాసి పెట్టి లేదు అని నిరాశ తో సరి పెట్టుకుంటారు.
☀️☀️☀️☀️
• మరికొందరి పరిస్థితి చాలా ఆశ్చర్యం గా ఉంటుంది. మనసు కోరుకున్నవి, కావలసినవి అందుబాటులో నే ఉంటాయి, కానీ అనుభవించడానికి మాత్రం, అందని ద్రాక్ష పండ్లు లా ఉంటాయి. ఉదాహరణకు ఒక మనిషి తన జీవితంలో లడ్డూ గురించి వినడమే గాని, ఏనాడు చూడడం గాని, తినడం గాని లేదు. ఎప్పటికైనా లడ్డూ తిని చనిపోతే చాలు ఈ జన్మ చరితార్థం అని మనసు లో, ఊహ తెలిసిన నాటి నుండి అనుకునేవాడు. అతనికి వయసు 55 సంవత్సరాలు వచ్చాయి. అతనికి విపరీతమైన మధుమేహ వ్యాధి వచ్చింది. అపుడు వైద్యుడు నువ్వు ఏనాడైతే చక్కెర పదార్థాలు తింటావో అదే నీకు ఆఖరి రోజు అని చెప్పాడు. ఒక రోజు అతనికి ఒక ప్రముఖ మిఠాయి దుకాణం లో , పని దొరికింది. అక్కడ పని చేసే వారు ఉచితంగా మిఠాయిలు తినవచ్చు. చుట్టూ ఎన్నో రకాల రుచికరమైన మిఠాయిలు ఉండేవి, వాటిలో ముఖ్యంగా తన జీవిత సార్థకానికి కావలసిన లడ్డూ ఎదురుగా నే ఉండేది. నిత్యం తాజాగా ఉన్న లడ్డూ సువాసన ని చూస్తూనే ఆనందం తో, కూడిన మానసిక క్షోభ అనుభవించే వాడు. చూస్తే ఈ స్థితి ఎంత విచారకరం గా అనిపిస్తుందో కదా…. బహుశా కొందరికి జీవితం అంటే ఇదేనేమో. ఒక మనిషి గా ఆలోచిస్తే ఈ స్థితి చాలా విచిత్రం గా అనిపిస్తుంది. కానీ మనసు గొప్పది, ఎందుకంటే అది కోరుకున్నది నెరవేర్చుకోవడమే దాని అంతిమ లక్ష్యం. అప్పుడు మనసు తెలివిగా ఇలా ఆలోచించడం మొదలు పెట్టింది. నా జీవిత సార్థకత లడ్డూ రుచిచూడడం. ఎప్పటికైనా మరణం తధ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ…అని తనకు నచ్చిన లడ్డూ త్రృప్తిగా తిని, మనసు కోరిక నెరవేర్చుకున్నది.
• “ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ” అనేదే మనసు నినాదం అనుకుంటా.
YSR 23 May 21 3:00 pm
No comments:
Post a Comment