Wednesday, August 31, 2022

239. ఎందుకో అసలెందుకో

 


ఎందుకో   అసలెందుకో


 

• ఏ  ప్రేమ  ఎందుకో       ఏ భావమెందుకో

  ఏ  మనిషి  ఎందుకో     ఏ మనసు ఎవరికో

  ఎందుకో      అసలెందుకో

  ఈ   ఆశ నిరాశల   అలలు   ఎందుకో.


• అర్థం  లేని ప్రేమ పై       అనురాగం  ఎందుకో.

  వ్యర్థం అని తెలిసినా    పరితపన   ఎందుకో.

  ఎందుకో    అసలెందుకో

  ఈ ఊహల పల్లకి లో   ఊరేగింపు ఎందుకో


• ఏ మనిషి    ఆశలో       ఏమి దాగుందో

  ఏ మనసు   భాసలో     ఏమి రాసుందో

  ఎందుకో   అసలెందుకో

  ఈ  దాగుడు  మూతల  ఆటలు   ఎందుకో


• ఏ  నుదుటి  రాతలో    ఏ యోగముందో

  ఏ  జీవిత  గాధలో       ఏ అగాధముందో

  ఎందుకో     అసలెందుకో

  ఈ  దిశ లేని   పయనం  ఎందుకో


• మృదువైన  మాటకి      రోదన  ఎందుకో

  అలసి సొలసే   జీవికి    వేదన  ఎందుకో

  ఎందుకో   అసలెందుకో

  ఈ  సుఖదుఃఖాల  వెలుగు నీడలు  ఎందుకో


• అందాల రామచిలుక కి   రంగులు ఎందుకో

  బంగారు పాలపిట్ట కి   దిగులు  ఎందుకో

  ఎందుకో  అసలెందుకో

  ఈ ఊయల ఊగిసలాట లు   ఎందుకో

  నా కే ఎందుకో.


యడ్ల శ్రీనివాసరావు  1 Sep  2022  6:00 AM








Saturday, August 27, 2022

238. వినాయక వినాయక

 

వినాయక వినాయక



• వినాయక  వినాయక     లంభోధర గజ  వినాయక

• గజానన    గజానన      విఘ్నధర  వజ  గజానన


• చిట్టి చేతులతో    మట్టిని  మలచగ 

   ముద్దుగ   నిలిచిన    వినాయక

• చలువ పందిరి లో    చల్లగా కొలువై 

   వరములు  విడిచే   వినాయక


• వినాయక   వినాయక      లంభోధర  గజ  వినాయక

• గజానన     గజానన         విఘ్నధర  వజ  గజానన


• శుద్ధ చవితిన    శుభముల తోడి 

  నరులకు    అభయము   నిస్తావు.

• ఫక్కున నవ్వి    పరిహసించిన 

   నిందల   నెపమును  ఇస్తావు.


• వినాయక   వినాయక     లంభోధర  గజ  వినాయక

• గజానన     గజానన        విఘ్నధర  వజ  గజానన


• వెన్ను  అంత్యమున  ధారణ శక్తి కి 

  అధి  దేవుడవై   నిలిచావు

• ఆది గురువు వై   మూలాధారము న

   ఆత్మ   దేహము లను చూపావు.


• వినాయక  వినాయక     లంభోధర  గజ  వినాయక

• గజానన   గజానన         విఘ్నధర  వజ  గజానన


• బుద్ది న  బీజమై   గం గణముల    గంటలు 

  ఘల్లున మోగించే  బీజభవహర   వినాయక


• అష్టసిద్ధులు తో శక్తి యుక్తిలను 

  ధారణ చేసే వినాయక


• వినాయక వినాయక     విఘ్ననాశకర   వినాయక

• గజానన గజానన       జయ విజయిభవ గజానన.


యడ్ల శ్రీనివాసరావు 27 August 2022 7:30 PM.


వజ = గరిక, వచనం

అధి = పాలించే

మూలాధారము= నాడులకు ఆధారమైన చక్రం 












Friday, August 26, 2022

237. శివుని ఆట పాట

 

శివుని ఆట పాట


• ఏమి ఆట శివ    ఇది    ఏమి పాట శివ

  ఏమి ఆట శివ    ఇది    ఏమి పాట శివ


• శివ శివ అని పిలువగ    శివమెత్తె  నా  స్వయం

  హర హర అని అరవగ   హరియించె  నా అహం


• శివ శివ అని పిలువగ     శివమెత్తె  నా  స్వయం

  హర హర అని అరవగ   హరియించె  నా అహం


• శివ స్వరం    లోని  వరం   రాగమై

  నను తాకగ   అనురాగం కురిసెను.

• హర  ధ్వనం  లోని  జపం  గానమై

  నను తాకగా  ఆనందం   విరిసెను.


• ఏమి ఆట శివ    ఇది   ఏమి పాట శివ

  ఏమి ఆట శివ    ఇది   ఏమి పాట శివ


• శివ శివ  అను  పలుకు కి

  క్రోధము  కరిగి   కరుణగా మారే.

• హర హర  అను  పదము కి

   మోహము  మరిచి    మోక్షము  మిగిలే.


• ఏమి ఆట శివ     ఇది    ఏమి పాట శివ

  ఏమి ఆట శివ     ఇది    ఏమి పాట శివ


• శివ శివ   అని పిలువగ     శివమెత్తె  నా  స్వయం

  హర హర  అని అరవగ    హరియించె  నా  అహం


• మేళతాళముల తో     

  శివ నామమే  చేయగా

  చిద్విలాసము  న   

  పవళించే   కైలాస వాసా.

• జలము  పోసిన   లింగము  

  జగము కే   శరణమయిన

  కొలువు  చేసిన   కాలుడు కిి     నే

  జంగమయ్యే  ….  సత్సంగమయ్యే.


• ఏమి ఆట శివ   ఇది    ఏమి పాట శివ

• ఏమి ఆట శివ   ఇది    ఏమి పాట శివ


యడ్ల శ్రీనివాసరావు 26 August 2022 9:30 PM.


శివమెత్తు = ఆవేశముగ

స్వయం = ఆత్మ

ధ్వనం = శబ్దం

జపం = వేదం, మంత్రం

మోహము = అజ్ఞానం

మోక్షం = జ్ఞానం, విముక్తి

కాలుడు = శివుడు, యముడు, శనైశ్చరుడు.

జంగమ = శూద్ర జాతి లో శివభక్తుడు.













Wednesday, August 24, 2022

236. ఏమి చెప్పేది శివ _ ఏమి రా‌సేది హర

 

ఏమి చెప్పేది శివ _ ఏమి రా‌సేది హర



• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర

• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర


• శివుని తత్వము   ఎరిగిన జన్మమే

  శివుని పాదము   చేరు మార్గము.

  అది యే   జీవుని కి    సన్మార్గము.


• శివుని చూచుట    ఏ జన్మ వరమో

  శివుని కొలుచుట   ఏ కర్మ ఫలమో

  అది యే   జీవుని కి   భాగ్యప్రదము.


• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర

• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర


• ఆత్మ  నెరుగని  వానికి

  ఆనందం  ఎట్లు  తెలిసే


• పరమాత్మ   నెరుగని  వానికి

  పరమానందం  ఎట్లు  కలిగే.


• ఆత్మ  పరమాత్మ ల  నెరుగని

  వానికి  తానెవ్వరో  ఎట్లు తెలిసే.


• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర

• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర


• చూడలేని వానికి   శివుడు కానరాడనే

  కాని   శివుడు   లేడని  కాదు.

  శివుడు  రాడని  కాదు.


• ఇహలోక   మోహలకు   బానిసలైన

  పరలోక దివ్యం   ఎట్లు పొందును.

  ఆది మూలం    ఏల  తెలియును.


• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర

• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర


• దేహమే లేనట్లు    దేహి   అయిన నాడు

  శివుని దర్శనము తో   ముక్తి  కలుగును.

  జనన మరణాల   నుండి    విముక్తి కలుగును.


• శివుని చేరాలంటే   శిల పూజ కాదు

  ఆత్మ శుద్ధి  తో నే  సాధ్యం.

  పరమాత్మ   ప్రీతి  తో నే  సుసాధ్యం.



యడ్ల శ్రీనివాసరావు 24 Aug 2022 11:30 AM.












Monday, August 22, 2022

235. నీ వేనా _ నీవు _ నీ వేనా

 

నీ వేనా    నీవు  నీ వేనా


• నీ వేనా    నీవు   నీ వేనా

• నేను చూసిన  ఆ నవ్వు లోని  రూపం  నువ్వే నా


• చేరువైన   కాలం లో

  చెరిగిపోని  భావం తో

• చెలిమి చేసి   కలసి చూసి

  కోరుకున్న   క్షణాలు  ఇవేనా


• నీ వేనా   నీవు   నీ వేనా

• నేను చూసిన  ఆ నవ్వు లోని  రూపం  నువ్వే నా


• మనసు లోని   శోకం తో

  మరువ  లేని    వేదన తో

• ఎదురు చూసి   దిగులు చెందే

  కదలని    కాలం   ఇదేనా


• నీ వేనా   నీవు     నాలో ని    నీ వేనా

• నే నేనా   నేను    నా లో ని    నే నేనా


• అర్దం  కాని  ఊహలు 

  మకరందం లో   మునిగి ఉన్నాయి.

• వ్యర్థం  అయిన   భాసలు 

  గాలి లో   తేలుతున్నాయి


• చూడ లేని   ప్రేమ కి   చూపు  కరువయ్యింది

• నీడ లేని    తోడు కి    జాడ    కరువయ్యింది.


• నీ వేనా    నీవు   నీ వేనా

• నేను చూసిన  ఆ నవ్వు లోని   రూపం  నువ్వే నా


• చేరువైన    కాలం లో

  చెరిగిపోని  భావం తో

• చెలిమి చేసి    కలసి చూసి

  కోరుకున్న    క్షణాలు  ఇవేనా


• రెప్పలు  మూసిన  కంటికి 

  రేయి  పగలు  ఒకటే

• దిక్కులు  తెలియని  చుక్కకి 

  వెలుగు నీడ  ఒకటే


• మౌనం  నిండిన  మనిషి కి 

   నవ్వు ఏడుపు  ఒకటే

• మాటలు పలకని   మనసు కి 

  రాయి రత్నం  ఒకటే


• నేనే లే       ఇది  నేను    నేనే లే

• నువ్వే లే    అది నువ్వు   నువ్వే లే


• చేరువైన  కాలం లో

  చెరిగిపోని  భావం తో

• చెలిమి చేసి    కలసి చూసి

  కోరుకున్న   క్షణాలు   ఇవే లే




యడ్ల శ్రీనివాసరావు 22 Aug 2022 10:00 PM.







Sunday, August 21, 2022

234. అర్థనారీశ్వరుడు

 

అర్థనారీశ్వరుడు


• శ్రీ శైల  నందీశ్వరా  

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• బంధాల  అడుగుల తో  మడుగులో 

  ముంచేటి  నటరాజ రాజేశ్వర

• దుఃఖాల  దహనం తో  ఆత్మ మలినాన్ని 

  కడిగేటి  కర్మ కాల  కాళేశ్వర


• ఆవాస   సాహసం   నివాసి యోగం

• సంసార  సాగరం   జీవన్ముక్తి సోపానం


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• అర్థాంగి  అంటే   జీవన రేఖకు 

  తోడుగా  నిలిచే  చిత్రాంగి  అని

• అర్ధనారీశ్వరుడు  అంటే    ఆ 

  తోడుకు  నీడగా  నిలిచే ఉండే  వాడని


• కళ్యాణం   చేస్తావు     కోటిలింగేశ్వర

• కమనీయం  అంటావు    కేదారేశ్వర


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• స్త్రీ పురుష   సంయోగం   సయోగం 

  ప్రకృతి  పరవశం

• ముడి పడిన  బంధాల   ప్రయాణం 

  బుణ  కర్మ పాశం

• ఆది అంతాల   నాటక మింతే గా    అర్ధనారీశ్వర

• నీలి మేఘాల   జీవిత మింతే గా    జ్ఞాన యోగీశ్వర


• ప్రాణనాధేశ్వర     భూతనాధేశ్వర

• సకల జీవేశ్వర    ఆత్మ భువనేశ్వర


• ఓం…..


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల   మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


యడ్ల శ్రీనివాసరావు 21 August 2022 11:00 PM.









Wednesday, August 17, 2022

233. ఏమి చేసేది శివా_ఏమి ఇచ్చేది హర

 

ఏమి చేసేది శివా_ఏమి ఇచ్చేది హర



• శివా…ఓ శివా…

• సర్వం నీవు      స్మరణం నీవు

  సకలం నీవు      సదనం నీవు

• ఏమి భాగ్యము    నీ కీర్తన

  ఏమి భోగము      నీ రాగము


• శివ శివ  అను  నీ పిలుపు కి

  నా దేహం  లోని    నవ నాడులు

  బంగారు తీగలై   కాంతు  లీనుతుంటే 

  ఆ తీగలతో   నీ కాలి   గజ్జె  నై  కానా.


• హర హర అను నీ పిలుపు కి

  ఈ లోకం లోని పంచ భూతాలు

  పరవశం తో  ప్రకృతై    ప్రణమిల్లు తుంటే

  ఆ ప్రకృతితో    నీ కాలి  అందె  నై  రానా…


• ఏమి చేసేది శివ        ఏమి ఇచ్చేది హర

• ఏమి చేసేది శివ        ఏమి ఇచ్చేది హర


• చేయుటకు స్మరణ    తప్ప   నా కేమి ఎరుక

• ఇచ్చుటకు దేహము  తప్ప   నే నేమి  కలుగ


• ఏమి చేసేది శివ         ఏమి ఇచ్చేది హర

• ఏమి చేసేది శివ         ఏమి ఇచ్చేది హర


• నిజము కాని     ఈ లోకం లో    నేనెందుకు శివ

• నిజమైన     నీ లోకానికి     దారి చూపు హర


• శివా…ఓ శివా…

• సర్వం నీవు     స్మరణం నీవు

  సకలం నీవు     సదనం నీవు

• ఏమి భాగ్యము     నీ కీర్తన

  ఏమి భోగము       నీ రాగము


• రేయి  పగలెరుగక    మది తలపులో

  నీ జాడ కోసం     వెతుకుతునే ఉన్నా

  జాడ ఎరుగని   నాకు   మరణమే శరణం

  నీ  నీడ తాకని   నా జన్మమే   వ్యర్ధము.


• ఏమి చేసేది శివ        ఏమి ఇచ్చేది హర

• ఏమి చేసేది శివ         ఏమి ఇచ్చేది హర


యడ్ల శ్రీనివాసరావు 17 August 2022 8:00 PM.












Sunday, August 14, 2022

232. మహకాళేశ్వరుడు

 

మహకాళేశ్వరుడు



• ఆనంద నిలయా    మార్తాండ హృదయా

  విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది


• నీ దరి  చేరుటకు    ఈ  దేహమే   ఆటంకమా

  నీ అనతి తో    అది ఎంత    క్షణభంగురము


• విడవాలని ఉంది   విడిచి రావాలని ఉంది


• భస్మము ను   ఆరతి గ    ఆరగించు వాడా

  భువనమండలము ను బూడిద గ  చేయగల వాడా

• మూడు కన్నుల వాడా      మహ కాళేశ్వరుడా

  శరణు తో అడుగుతున్నాను

  విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది.

  విడవాలన్నది   ఈ   దేహము

  విడిచి   రావాలన్నది   నీ  నీడకి


• కర్మ బంధము ల లో    కబళింపు కంటే

  మాయ మర్మము ల లో    సంబాళింపు కంటే

  నీ పాద ధూళి లో    రేణువుయినా  ధన్యం.


• ఆనంద నిలయా     మార్తాండ హృదయా

  విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది


• నిందలను  మోసేటి    గిరిధరుని కాదు

  శత్రృవధ   చేసేటి      పార్థుడిని కాదు

• నీ  జాడ   వెతికే   అర్బకుడిని

   నీ  నీడ    కోరేటి   అల్పుడిని

• మహకాలుడా     మహాదేవుడా

  సిద్దయోగుడా     సదానందుడా


• విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది


• బంధాల  కొలిమి లో   కాలితే కాని

  కానరావా   శివా

• అయితే   నిర్బంధాల   నడుమ

  బూడిద  గాంచు  హర

• శరణు తో అడుగుతున్నాను


• విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది


• నీ పదము ఎంత మధురం

  నీ పాదము అంత శరణం.

• నీ తలపు ఎంత తన్మయం

  నా ఆత్మకు అంత ఆనందం.


• ఆనంద నిలయా    మార్తాండ హృదయ

  విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది



కబళింపు = మింగి వేయుట

సంబాళింపు =ఓదార్పు, ఆదరింపు

అర్బకుడు = శక్తి హీనుడు.

అల్పుడు = ఆధారం లేని వాడు, నిరాధారుడు.


యడ్ల శ్రీనివాసరావు 15 August 2022 2:00 AM











Saturday, August 13, 2022

231. శ్రావణి గీతం

 

శ్రావణి గీతం



• శ్రావణి   సంగీత  సారంగిని

  సరిగమల   శ్రవణానందిని

• శ్రావణి   సంగీత  సారంగిని

  సరిగమల  శ్రవణానందిని


• గమకాల  సొగసులతో  గీతిక లాడే  గాయనీ

• పదములకు  శృతి కలిపిన 

• కవితలకి  లయ తెలిపిన 

• పాడే నీ గానం   అమృత వర్షం

• పలికే  నీ రాగం  సెలయేటి  జలపాతం.


• శ్రావణి   సంగీత  సారంగిని

  సరిగమల   శ్రవణానందిని

 

• నా పరిచయాన   పలకరింపులు

  నీకు పదనిసలు గ   మారితే

• నీ పరామర్శల  ప్రాసలు

  నా ఛందస్సు కి  భాస యై

• పూచెను   ఈ కావ్యపుష్పం

  వీచేను   నీ గాన  పరిమళం

• శ్రావణి   సంగీత  సారంగిని

  సరిగమల   శ్రవణానందిని


• రచన  సిగ్గు  పడుతుంది

  రత్నమే   పాడుతున్నందుకు


• కలము  ఎగసి  పడుతుంది

  కంఠమును  కమలం గా  చేసేందుకు


• నిను తాకిన సీతాకోకలు

  సముద్రాలు దాటొచ్చి  స్వరాలను  వినిపిస్తుంటే.

• వాటి రంగులు  నా మనసుకి

  హంగులై    హరివిల్లు  నిలయమై నిలిచింది.

• ధృవతార  గానానికి 

  ధృవతీరాలు  కలిసాయి

• శ్రావణి   సంగీత  సారంగిని

  సరిగమల   శ్రవణానందిని


యడ్ల శ్రీనివాసరావు 14 August 2022 5:00 AM.







Friday, August 12, 2022

230. కాలం

 

కాలం 


• కాలం  "కల"కాలం

• కలికాలం   మాయా  కలకలం.


• కదిలే కాలానికి ఏమీ తెలుసు

  కను సైగ ల  భాష్యం


• కాలం లో నువ్వు ఉన్నావు కానీ

  నీ కను సైగలలో కాలం లేదు.


• కాలం తిరుగుతునే ఉంది రేయి పగలు గా

• కాలం లో ని   నిశ్శబ్దం   నీకు ఏదో  చెపుతుంది

• కాలం లో ని   చీకటి      నీకు ఏదో   చూపిస్తుంది.


• నిన్న నీది కాదు   నేడు నీది కాదు   రేపు నీది కాదు

  కానీ  ఏదో  ఒక రోజంటూ  ఉంది.    అదే నీ రోజు

• కాలం తో స్నేహం చెయ్  నీవు ఎవరో తెలుస్తుంది.


• కాలాన్ని  శిరసావహించు  రక్షణ నిస్తుంది.

• కాలం ఏదొక టి నేర్పి స్తూనే ఉంటుంది 

  ఉన్నంత కాలం.


• కాలం దైవం ఆజ్ఞలో నడుస్తుంది.

• కాలాన్ని దాటి వెళ్ళ గలవేమో ప్రయత్నించు.

• కాలం నిను విడవాలంటే 

  నిన్ను నువ్వు వదులుకో

  అప్పుడే  కాలాన్ని పాలించే దైవం నిను చూస్తుంది.


ఒక్కడివై వచ్చావు...ఒక్కడివై వెళ్తావు...

ఎక్కడ నుండి వచ్చావో అక్కడికే వెళ్లాలి...


ఔనన్నా కాదన్నా 84 జన్మలలో  

చివరికి  తెలుసుకో వలసిన నిజం.


యడ్ల శ్రీనివాసరావు 13 August 2022 12:00 AM









.


Thursday, August 11, 2022

229. మల్లెల శ్ర వణి

 

మల్లెల శ్ర వణి



• సొగసైన  సిగపైన  మల్లెలా  సిరిమల్లెలా

  శ్రావణ మాసంలో   పలికిన వీణ

  మానసవీణ    ఓ శ్ర వీణ

  వీణ  ఓ శ్ర వీణ.


• నా చేతి  పద విన్యాసాలు

  నీ చేత    అజంతా  శిల్పాలవుతుంటే

  నీ చిత్రలేఖనం   సుందరం   బహు సుందరం


• నా కలము లోని పద కావ్యాలు

  నీ కంఠ  శ్రవణ రాగాలవుతుంటే

  నీ స్వరలాపనం   వందనం  బహు వందనం


• సొగసైన  సిగపైన  మల్లెలా   సిరిమల్లెలా

  శ్రావణ మాసంలో  పలికిన వీణ

  మానసవీణ    ఓ  శ్ర వీణ.

  వీణ   ఓ  శ్ర వీణ


• ఇది కలయో  మాయో  తెలియడం లేదు

  నీలాకాశం లో   దాగిన   శ్రావణి  సంజీవని.


• నా పదం   నీ స్వరం కలిసి 

  వెండి వాకిట్లో  నాట్యమాడుతుంటే

• ఈ వసంతపు వెన్నెల్లో 

  నా నీడలా  నువు కనిపిస్తున్నావు.


• ఇక కాలం పిలుస్తుంది    

  దూరం కలుస్తొంది

• నవ జీవని శ్రావణి   

  నీ మనసు ప్రేమ వని.


• సొగసైన సిగపైన మల్లెలా సిరిమల్లెలా

  శ్రావణ మాసంలో పలికిన వీణ

  మానసవీణ ఓ శ్ర వీణ.

  వీణ ఓ శ్ర వీణ



వని = వనము, అరణ్యము

యడ్ల శ్రీనివాసరావు 12 August 2:00 AM.

















Wednesday, August 10, 2022

228. రాఖీ పౌర్ణమి

 

రాఖీ పౌర్ణమి


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి  జన్మ కొక   అందం

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

   సాగేను   ఆ   బాల చందం


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి  జన్మ కొక  అందం

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

  సాగేను  ఆ  బాల చందం.


• గిల్లి కజ్జాలతో     గోల కేరింతలతో   

   ఎగసి  పడే    ఆ ఆనందం.

• రాగద్వేషాలు   పెంచుకొని 

  పంచుకొనే   తొలి  బాల్య బంధం.


• పసి హృదయాలను   పసిడి గా  చేసే 

  పసుపుపచ్చ ని   బంధం.

• మలి హృదయాలకు  

  మూలం  మరవ నివ్వని   సంబంధం.


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి జన్మ కొక  అందం.

• ఆడే  ఆటలతో    పాడే పాటలతో 

  సాగేను   ఆ  బాల చందం.


• అమ్మ ను   “మించి” న   అమ్మే  సోదరి ...

  భావోద్వేగాల  తోడుకు  సహ దరి.

• నాన్న ను   “మించ“ ని   నాన్నే  అన్న …

  భావోద్వేగాల  నడుమ  నలిగే వాడు.


• కష్టసుఖాలకు    నేనున్నా నని 

  నిలిచేటి   అనుబంధం.

• నిలవలేని   ఎన్నో బంధాలకు 

  అతీతమైన  దీ  ఈ  రక్తసంబంధం.


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి   జన్మ కొక  అందం.

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

  సాగేను   ఆ  బాల చందం.


• ఒకరికి  ఒకరు  రక్షణ 

  అదియే  పరిరక్షణ.

• తృణము   పణము  బుణము

  అదియే  రక్షాబంధానికి  సంరక్షణ


• శ్రావణ శుభ తరుణం లో 

  నిండు అనురాగపు వెన్నెల ఈ రాఖీ పౌర్ణమి.


ప్రకృతి సిద్దాంతం ప్రకారం , స్త్రీలు స్వతహాగా ప్రేమతో భావోద్వేగాలను నియంత్రణ చేసే శక్తి కలవారు.

పురుషులు భావోద్వేగాలను నియంత్రణ చేసుకోలేక స్త్రీలపై ఆధారపడేవారు.



నాటి కాలంలో బంధాలు బంగారం లా ఉండేవి.

నేటి కాలంలో బంధాలు బరువై "పో  తున్నాయి".

బంధాలను అందంగా చూసుకుంటే నే ఆనందం మిగులుతుంది.  

రక్త సంబంధాలను  ప్రాణం ఉన్నంతవరకూ  ప్రేమించండి. రక్త సంబంధం  కాని  బంధాలను గౌరవించండి. 


ఈ సృష్టిలో  ప్రతీ మనిషి  "బంధం"  ఏదో ఒక కర్మతో   ముడిపడిన  బుణానుబంధం.   

బుణం ఏమిటో తెలుసుకొని  తీర్చుకునే వారు అదృష్టవంతులు. లేకుంటే  జన్మ జన్మల కి వడ్డీ పెరుగుతునే ఉంటుంది.  

ఇంతకీ ఆ బుణం ఏమిటి అనేది బుద్ధి, మనసు, ఆత్మ కే తెలుస్తుంది.


రక్షాబంధనం అంటే అసలు అర్థం,  ఈ ప్రపంచంలో మనుషులందరూ పరమాత్మ పిల్లలు. ఈ పిల్లలు అందరూ కూడా పరమాత్మ దృష్టిలో సోదర సోదరీమణులే.   తన పిల్లలకు రక్షణగా ఉన్నానని పరమాత్మ తన బంధాన్ని పిల్లలకు  తెలియచేసే పండుగ. పిల్లలు పరమాత్మ ని మరచి పోయి ఇహలోకంలో మాయలో చిక్కుకొని రక్షణ కరువై  విలవిలలాడుతూ ఉంటారు. అది జ్ఞప్తికి చేసేదే రక్షాబంధనం....అదే రాఖీ పౌర్ణమి.... పరమాత్మ చంద్రుని నిండు వెన్నెల తో ఈ పౌర్ణమి నాడు తన రక్షణను వెలుగు లా సమస్త ప్రాణులకు ఇస్తాడు. మనిషి చేయవలసింది ఒక్కటే పరమాత్మ ను గుర్తించి ఆ బంధం నిలబెట్టుకోవడం.


ఈశ్వర అనుగ్రహం 🙏

యడ్ల శ్రీనివాసరావు 11 August 2022  1:00 AM.






227. శ్రావణి రాగం

 

శ్రావణి రాగం


• శ్రావణ రాగం తో ఈ సంధ్య సమయం లో

• ఊహ గానంతో పలికిన  శ్రావణి….ఓ శ్రావణి.


• శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి వెన్నెల లో

• ప్రేమ లోకంతో కలిసిన  శ్రావణి…ఓ శ్రావణి.


• పలికిన నీ రాగం తో ప్రేమ కుసుమం పూసింది

• కలిసిన ఈ మాసం తో కనకాంబరం అయింది.


• పలుకుతున్న నీ స్వరం ప్రేమ సాగరం ఈదింది.

• మీటుతున్న నీ రాగం సప్త సాగరాలు దాటింది.


• నువు గీసిన చిత్రమే విచిత్రమై 

  నా కావ్యానికి జీవం అయ్యింది.

• నువు పాడిన పాటయే పావటమై 

  నా పదాలకు ప్రాణం అయ్యింది.


• కళళలను కలిగిన కాణాచి కి 

  కన్నీళ్లను దాటి వచ్చావు.

• చీకటి నింపిన కాలాని కి 

   నీ వెలుగే చూపిస్తున్నావు.


• శ్రావణ రాగం తో ఈ సంధ్య సమయం లో

• ఊహ గానంతో పలికిన శ్రావణి….ఓ శ్రావణి.


• శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి వెన్నెల లో

• ప్రేమ లోకంతో కలిసిన శ్రావణి…ఓ శ్రావణి.



పావటము = సోపానం, మెట్టు, అధిరోహణం.

కాణాచి కి = చిరకాలమైన సుస్థిర స్థానాని కి


యడ్ల శ్రీనివాసరావు 10 August 2022 6:30 PM.








Tuesday, August 9, 2022

226. శ్రావణి

 

శ్రావణి


• శ్రావణి … ఓ శ్రావణి    సంతోషాల తరంగిణి

  దూర తీరాన హాసిని   సుమధుర భాషిణి


• శ్రావణి … ఓ శ్రావణి    సంతోషాల తరంగిణి

  ఆహా భావాల రాగిణి   ఎదురు చూపుల నిరీక్షణి.


• ఎదలో దాగిన  నీ భావం   ఎల్లలు దాటోచ్చింది.

  ఎన్నాళ్లో వేచిన  ఉదయం   ఈనాడే తిరిగొచ్చింది.


• నువు వెతికిన  రూపం   నీ ముంగిట నిలిచింది

  కలబోసిన కావ్యాలను  కనులముందు  నిలిపింది


• శ్రావణి … ఓ శ్రావణి   సంతోషాల  తరంగిణి

  దూర తీరాన   హాసిని  సుమధుర   భాషిణి


• నీ జీవన రేఖను   నుదుటి రేఖని   తలచావు

  ఆ నుదుటి  రేఖ న   నీ ప్రేమ  కోసమే  వెతికావు


• హద్దే తెలియని  ప్రేమ   సరిహద్దులు   దాటొచ్చింది

  దూరం ఎరుగని  నీ మనసుకు   దారే చూపించింది.


• శ్రావణి … ఓ శ్రావణి    సంతోషాల తరంగిణి

  ఆహా భావాల రాగిణి   ఎదురు చూపుల నిరీక్షణి.


• నిజం నిండిన ప్రేమకి   విశ్వమంత   ఉనికే అని

  ఎన్నో జన్మల  అంతరానికి  ఆరాధన  అయింది.


• కనులలో  దాగిన  కలలను   కలం నిజం చేస్తుంది.

  కలవరపడిన  నీ ప్రేమను  కళకళలాడే లా చేస్తుంది


• శ్రావణి … ఓ శ్రావణి     సంతోషాల తరంగిణి

  దూర తీరాన హాసిని    సుమధుర భాషిణి


• శ్రావణి … ఓ శ్రావణి    సంతోషాల తరంగిణి

 ఆహా భావాల రాగిణి    ఎదురు చూపుల నిరీక్షణి.



యడ్ల శ్రీనివాసరావు 9 August 2022 , 7:30 pm.







Saturday, August 6, 2022

225. అడుగుల _ చూపులు

 

 అడుగుల _ చూపులు


• కలిసాయి  కలిసాయి

  నీ  అడుగుల్లో   నా అడుగులు

• కలిసాయి  కలిసాయి

  నీ చూపుల్లో  నా చూపులు


• ఆడగక  నే  అడుగుతున్నా

  నీ అడుగు లో   మడుగై  ఉంటానని


• చూడక  నే చూస్తున్నా

  నీ  కంటిపాప న    నా రూపాన్ని.


• తడబడే     నీ అడుగులకు  తోడై   నే రా నా

• జడిపడే      నీ చూపులకు   నీడై    నే లే నా


• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే

• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే


• మౌనం తో  వేసే  నీ అడుగుల ను  ఏమని అడగాలి

• భారం గా   చూసే  నీ చూపుల లో  ఏమి చూడాలి


• కలిసాయి  కలిసాయి

  నీ అడుగుల్లో   నా అడుగులు

• కలిసాయి  కలిసాయి

  నీ చూపుల్లో   నా చూపులు


• చూడు చూడు   నా  చూపులతో

  ఈ అందమైన  లోకం లో   దాగిన  నీ అందాన్ని

  ఈ పువ్వులు  సరితూగ  గలవా

  నీ  నవ్వుకి   వెల  కట్టగలమా


• ఆగి ఆగి  నా తో   అడుగులెయ్యి

  ఈ  సుందర వనమే  అడుగును  నీ వయ్యారాన్ని

  ఈ  గువ్వలు   కన్నార్ప  గలవా

  నీ   మువ్వల   సడి  నాపగలమా


• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే

• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే


• కలిసాయి   కలిసాయి

  నీ అడుగుల్లో నా అడుగులు

• కలిసాయి కలిసాయి

   నీ చూపుల్లో  నా చూపులు


• ఆడగక  నే   అడుగుతున్నా

  నీ అడుగు లో   మడుగై  ఉంటానని

• చూడక  నే   చూస్తున్నా

  నీ  కంటిపాప న    నా రూపాన్ని


మడుగు = అణకువ.

జడి పడు = కంగారు, బాధ పడు.


యడ్ల శ్రీనివాసరావు 7 Aug 2022 3:30 AM.








224. స్నేహం … స్నేహం

 

స్నేహం … స్నేహం

స్నేహితుల దినోత్సవం సందర్భంగా…నా చిన్న నాటి మిత్రులందరికి అంకితం ఈ రచన.



• స్నేహం  ...  స్నేహం

  నను   వెతికిన  స్నేహం

  నీ  లోని   సగం.

• నువు  మరిచి నా

  నా  లో న    దాగి ఉన్నది   నీ  స్నేహం.


• తోడు కి    నీడై న  స్నేహం

  వెన్ను కి  దన్ను రా.

• చింత కి   చెంత న   చేరి

  చిరునవ్వు   నిచ్చే ది   కద రా.

• ప్రేమ  త్యాగాల   ఆశ రా

  నిండు  నూరేళ్ళు  భాస రా.... స్నేహం.


• స్నేహం  ...  స్నేహం

  నను  వెతికిన   స్నేహం

  నీ లోని సగం.

• నువు మరిచి నా

  నా  లో న   దాగి ఉన్నది  నీ స్నేహం.


• బుద్ది ని   సవరించి

 భుజము ను  తట్టేది   స్నేహం

• కష్టం గుర్తించి

  నష్టం   నిలిపేది   స్నేహం.


• స్నేహానికి   ఆయువు  విశ్వాసం

  స్నేహానికి   జీవం  నిజాయితీ.


• స్నేహం  ...  స్నేహం

  నను వెతికిన స్నేహం

  నీ  లోని  సగం.

• నువు  మరిచి నా

  నా  లో  న   దాగి ఉన్నది   నీ  స్నేహం.


• అహంకారం తో  ఆటలు  ఆడేది  కాదు

• పట్టుదలల తో  పోరాటం  చేసేది  కాదు.


• నమ్మకమనే   బాటలో  నడిచి

• న్యాయమైన  బంధమే   కద రా  ... స్నేహం


• స్నేహం ... స్నేహం

  నను  వెతికిన  స్నేహం

  నీ  లోని  సగం.

• నువు   మరిచి నా

  నా  లో న   దాగి ఉన్నది   నీ స్నేహం.


• నటన  నిండిన  స్నేహం   నాలుగే   రోజులు

• నమ్మకమైన   స్నేహం    నాలుగు   జన్మలు.


• అవసరాలు  కోసం  కాదు రా

• అవసరం  తెలిసి  తీర్చేది  స్నేహం.


• కాలక్షేపం  కోసం  కాదు  రా

• కాల క్షేమం  కోరేది   స్నేహం.


• స్నేహం  ...  స్నేహం

  నను  వెతికిన  స్నేహం

  నీ  లోని   సగం.

• నువు  మరిచి నా

  నా  లో  న   దాగి ఉన్నది   నీ  స్నేహం.


• నిజము  లేని  స్నేహం  

  ఎన్నాళ్ళో   నిలబడదు   రా.

• నిజమైన  స్నేహము 

  కన్ను మూసినా   మన్ను లో   కలవదు  రా….


స్నేహం ప్రతీ మనిషి కి మంచి అనుభూతి. 

ఎన్నో సమస్యలకి పరిష్కారం. 

స్నేహాన్ని గౌరవించడం, కాపాడుకోవడం చాలా అవసరం.

బలహీనతల కోసం స్నేహాన్ని  దుర్వినియోగం చేసుకుంటే చివరికి నష్టపోయేది మనుషులే కాని స్నేహం కాదు. 

ఎందుకంటే  మంచి స్నేహాంలో  దైైైవం  ఉంటుంది . 


యడ్ల శ్రీనివాసరావు 7 Aug 2022 , 12:15 AM.








Monday, August 1, 2022

223. అధమోత్తమ జీవులు


అధమోత్తమ జీవులు



• చాలా కాలం నుంచి, అంటే చిన్న నాటి నుండి మనసును వేధిస్తున్న విపరీతమైన ఆలోచన ఇది.


• బజారులో రోడ్డు మీద వెళుతున్నప్పుడు పుట్ పాత్ మీద, నడిరోడ్డు మధ్యలో, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవాలయాల బయట తరుచుగా ప్రతీ ఒక్కరికీ కనిపించే సన్నివేశం చిన్న పిల్లలు, వృద్ధులు, అంధులు, అంగవైకల్యం తో బాధపడే వికలాంగ యాచకులు కనిపిస్తూనే ఉంటారు. వారిని చూసినప్పుడు కొన్ని సార్లు దానం చేస్తాం, కొన్ని సార్లు ముఖం పక్కకు తిప్పుకుంటాం, కొన్ని సార్లు చిరాకు గా పొమ్మని విసుక్కుంటూ ఉంటాం. ఆ క్షణం ఆ ఆలోచన వదిలేసి మరొక పనిలో నిమగ్నమవుతుంటాం. ఇదంతా విచిత్రం ఏమీ కాదు. సహజంగా ప్రతీ ఊరిలో ప్రతీ చోట ప్రతీ ఒక్కరి కళ్ల ఎదుట జరిగే సహజమైన నిరంతర ప్రక్రియ.


• ఇది 1991 సంవత్సరం లో జరిగిన చిన్న సంఘటన. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నేను నెల్లూరు ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళుతున్నాను. రాజమండ్రిలో సర్కార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సాయింత్రం 5 గంటలకు ఎక్కడానికి రైల్వే స్టేషన్ కు వచ్చాను. నాతో పాటు నా ఇంటర్ లో బెస్ట్ ఫ్రెండ్ సురేంద్ర బెంగుళూరు లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అయ్యాడు, వాడు మద్రాసు వరకు ఆ టైన్ లో వస్తున్నాడు. ఇద్దరం ఒకేసారి రిజర్వేషన్ చేయించుకోవడం వలన ఒకే చోట బెర్త్ లు వచ్చాయి. రైలు ఇంకా రాలేదు. రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చుని ఉన్నాము ఇద్దరం. నాకు రాత్రి తినడానికి చికెన్ పలావ్ పేకెట్ పార్శిల్ చేసి పెట్టింది మా అమ్మ. అలాగే నాకు బాగా ఇష్టం అని పాపిడి స్వీట్లు (12 కలిపి ఒక పాకెట్ ఉంటుంది) కూడా తెచ్చుకున్నాను.


• రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం బెంచ్ మీద కూర్చుని నేను, సురేంద్ర మాట్లాడుతూ ఉండగా , ఎదురుగా రైల్వే పట్టాలమీద ఒక చిన్న పిల్ల వాడు, చింపిరి జుత్తు చిరిగిన పొడవైన చొక్కా తో, కాళ్లకి చెప్పులు లేకుండా , గోనె సంచి వీపున వేసుకుని ప్లాస్టిక్ కవర్ లు , కాగితాలు ఏరుకుంటూ ఉన్నాడు.


• ఆ పిల్ల వాడిని చూస్తుంటే ఉండలేక పోతున్నాను. ఏదో అలజడి మనసు లో మొదలైంది. నేను సురేంద్ర తో అన్నాను , చూడరా చిన్న పిల్లోడు , పాపం అని బాధపడ్డాను. సురేంద్ర నా వైపు చూసి అదోలా నవ్వాడు. నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వచ్చేసాయి. వెంటనే ఉండలేక నా బాగ్ లో నుంచి పాపిడి స్వీట్లు పాకేట్ తీసి ఆ చిన్న పిల్లాడికి ఇచ్చేసాను. ఆ పిల్ల వాడు సంతోషంగా తీసుకుని వెళ్లి పోయాడు. సురేంద్ర కి ఏమీ అర్ధం కాలేదు. ఏరా నీకు పిచ్చా ఏంటీ, నీకు స్వీట్లు బాగా ఇష్టం కదా, నువ్వు తినడానికి తెచ్చినవి ఆ పిల్లాడి కి ఇచ్చేసావు ఎందుకు అన్నాడు. ఏమో రా నాకు తెలియదు ఆ పిల్లాడి ని చూడలేకపోయాను, జాలేసింది అన్నాను. చాలు చాలు దానకర్ణుడువి బయలు దేరావు అని సరదాగా హేళన చేశాడు.


• ఇంతలో ట్రైన్ వచ్చింది, ఇద్దరం ఎక్కి కూర్చున్నాము. ట్రైన్ లో వెళ్తున్నా సరే నేను ఆ సంఘటన నేను మరచి పోయినా , సురేంద్ర నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నాడు చాలా సేపు. బహుశా ఆ టీనేజ్ అలాంటిది. ఇంతలో ట్రైన్ విజయవాడ వచ్చింది. మేము ఇంకా భోజనం చెయ్యలేదు . భోజనం తిందామని రెడీ అవుతున్నాం. కరెక్ట్ గా మా భోగి లో, మేము కిటికీ పక్కన కూర్చుని ఉన్నాము. ఫ్లాట్ ఫాం మీద ఒక ముసలి వ్యక్తి కి కాళ్లు లేవు, మెట్లు ఎక్కే ఫ్లై ఓవర్ కింద కూర్చుని మా వైపు చూస్తున్నాడు. నాకు చాలా జాలేసింది. మేము ఫుడ్ తినడానికి రెడీ అయ్యాము. అప్పుడు సురేంద్ర “ఏరా కొంపదీసి చికెన్ పలావ్ ఆ అడుక్కునే వాడికి ఇచ్చేస్తావా ఏంటీ” అని అనడం పూర్తికాకుండానే, నేను టైన్ దిగి వెళ్లి ఇచ్చేసాను. ఎందుకో కారణం తెలియదు మనసు మీద కొన్ని అంత ప్రభావం చూపిస్తాయనుకుంటా. ఆ తర్వాత సురేంద్ర ఫుడ్ షేర్ చే‌సుకుని తిన్నాం…..ఈ రెండు సంఘటనలు నేను ఆలోచించి కావాలని చేసినవి కావు. అవి ఎవరో బై ఫోర్స్ తో అలా జరిగాయి. ఎందుకంటే నాకు ఫుడ్ , స్వీట్స్, పలావ్ అంటే విపరీతమైన ఇష్టం. అసలు ఎవరు అడిగినా పెట్టను. ఇది జరిగి 30 సంవత్సరాలు అయినా అప్పుడప్పుడూ ఎందుకో గుర్తు వస్తూనే ఉంటుంది నేటి వరకు.


• ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే , ప్రతీ మనిషి లోను ప్రేమ, కోపం, ఇష్టం లాంటి గుణాలతో పాటు జాలి, దయ, కరుణ అనేవి కూడా సహజంగా ఉంటాయి. కానీ మన పరిస్థితుల వలన, స్వభావం వలన కొన్ని బయటకు వ్యక్త పరుస్తాం, కొన్ని మనసులోనే దాచుకుంటాము. కానీ మంచి గుణాలను ఎప్పుడూ దాచుకోవడం వలన ఉపయోగం ఉండదు సరికదా చివరికి ఆత్మ సంతృప్తి కూడా ఉండదు. అందుకే సాధ్యం అయినంత వరకు మంచి గుణాలను, లక్షణాలను బయటకు ఆచరించడం వలన పెండింగ్ లో ఉన్న కర్మలు తీరుతాయి.


• నేను ముఖ్యం గా చెప్పాలనుకున్నది ఏంటంటే…నాకు తరచూ పైన నేను పేర్కొన్న కొంతమంది విపరీతమైన అంగవైకల్యంతో, అంధత్వం తో, నేలమీద పాకుతూ, రైలు భోగీలలో కింద తుడుస్తూ జీవనం గడిపే యాచకుల ను చూసినప్పుడు చాలా తెలియని బాధ, గుండె కోతగా అనిపిస్తుంది. బయటకు రాని కన్నీళ్లు లోపల దిగమింగే వాడిని(may be my sensitiveness). ఆ సమయంలో వారి కోసం ఏదైనా చెయ్యాలని మనసు లో అనిపిస్తుంది కానీ ఏం చెయ్యాలో కూడా అర్దం కాదు, ఏదో డబ్బులు దానం చెయ్యడం తప్ప. కానీ వారిని చూసి నప్పుడు మాత్రం ఎవరికైనా నోటినుండి వచ్చే మాట “ అయ్యొ పాపం” అని తెలియకుండా నే అంటారు.


• ఒకోసారి మాత్రం వాళ్లని చూసినప్పుడు నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపిస్తుంది….. కానీ వాళ్ళు ఎందుకు ఇలా పుడతారు, ఇంత దయనీయమైన పరిస్థితిలో ఎందుకు జీవిస్తారు, చావలేక బ్రతుకుతూ ఎందుకు ఇలాంటి జన్మ అనుభవిస్తారు. అని పదే పదే పదే విపరీతమైన ప్రశ్నలు చాలా సార్లు వస్తాయి. కానీ ఈ మధ్య ఒకసారి గట్టిగా భగవంతుని ముందు ఈ ప్రశ్న ను ఉంచాను.


• సరిగ్గా రెండు రోజుల తరువాత పరమాత్మ శివుని నుండి ధ్యానం లో నాకు వచ్చిన సమాధానం ఇది…. అంగవైకల్యం గల యాచకులు, అంధులు, మతిస్థిమితం లేని వారు, ఇలా విపరీతమైన స్థితులలో ఉన్న వారిని చూసి జాలిపడడం, బాధపడడం కాదు కావలసింది. వారి నుంచి మీరు చాలా నేర్చు కోవాలి…. వారు ఈ లోకానికి, సమాజానికి , మిగిలిన మానవాళిని ఉద్ధరించడానికి, సందేశం ఇవ్వడానికి జన్మించారు. అదేంటంటే  ఒక వర్గం వారు  గత జన్మలలో  చెడు కర్మల ఫలితంగా  నేడు ఈ  విధమైన జన్మను   తీసుకుని   ఫలితం అనుభవిస్తున్నారు. అది నేడు మీ మానవాళికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్లను ఆ   దుర్బ్భేద్యమైన స్థితి  నుంచి ఎవరూ శాశ్వతం గా తప్పించలేరు .

 ఎందుకంటే వారు  చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తం గా వారి ఆత్మలు ఈ జన్మ ఈవిధంగా తీసుకున్నాయి.  వారిని ఆదర్శంగా తీసుకుని చెడు కర్మలు చేయకండి. లేదంటే అటువంటి జన్మ ఎవరికైనా రావచ్చును.


ఇందులో నే మరొక  వర్గం వారు,  గత జన్మలలో అన్ని అనుభవం పొందేసి, ఈ జన్మ లో మానసిక వైకల్యం తో  శరీరం తీసుకుంటారు. మనం ఇటువంటి వారిని చూసి  పిచ్ఛివారిగా అనుకుంటాం,  కానీ వీరి మైండ్ , మనసు దైవానికి అనుసంధానం అయి ఉంటుంది. వీరికి భౌతిక ప్రపంచంలో ఉన్న వాటితో ఏ అవసరం ఉండదు.   


•  నాకు అనిపిస్తుంది…. మనం చూడగలిగితే, అర్దం చేసుకోగలిగితే, సమాధానం వెతుక్కోవడం మెదలు పెడితే ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి నుండి , మనకు మంచి చేసినవారు, చెడు చేసిన వారు, మోసం చేసిన వారు, మనతో ఉంటూ వంచించి నటించే వారు, దుఃఖం కలిగించే వారి వలన కూడా,  జాగ్రత్త గా గమనిస్తే  ఏదో ఒక మంచి సందేశం మనకి తెలియవస్తుంది.


• జాలి దయ కరుణ అనేవి సాటి జీవులపై చూపడం వలన జీవుడిలో ఉన్న అంతర్గత రాక్షస గుణాలు నశించబడి ఉద్ధరించబడతాడు , తత్ఫలితంగా ఉత్తమమైన జన్మము పొంది విముక్తుడవుతాడు.


• ఇవన్నీ చాలా మంది కి తెలిసిన విషయాలే అయినా, ఎందుకో శివుని ద్వారా వచ్చిన ఆలోచనలు రాయించాయి.


యడ్ల శ్రీనివాసరావు 2 Aug 2022 , 12:15 AM.





613. పద - నది

  పద - నది • పదమే     ఈ   పదమే   నదమై   ఓ     నదమై    చేరెను    చెలి    సదనము. • ఈ  అలల  కావ్యాలు   తరంగాలు    తాకుతునే    ఉన్నాయి      ఎన్న...