Sunday, August 14, 2022

232. మహకాళేశ్వరుడు

 

మహకాళేశ్వరుడు



• ఆనంద నిలయా    మార్తాండ హృదయా

  విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది


• నీ దరి  చేరుటకు    ఈ  దేహమే   ఆటంకమా

  నీ అనతి తో    అది ఎంత    క్షణభంగురము


• విడవాలని ఉంది   విడిచి రావాలని ఉంది


• భస్మము ను   ఆరతి గ    ఆరగించు వాడా

  భువనమండలము ను బూడిద గ  చేయగల వాడా

• మూడు కన్నుల వాడా      మహ కాళేశ్వరుడా

  శరణు తో అడుగుతున్నాను

  విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది.

  విడవాలన్నది   ఈ   దేహము

  విడిచి   రావాలన్నది   నీ  నీడకి


• కర్మ బంధము ల లో    కబళింపు కంటే

  మాయ మర్మము ల లో    సంబాళింపు కంటే

  నీ పాద ధూళి లో    రేణువుయినా  ధన్యం.


• ఆనంద నిలయా     మార్తాండ హృదయా

  విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది


• నిందలను  మోసేటి    గిరిధరుని కాదు

  శత్రృవధ   చేసేటి      పార్థుడిని కాదు

• నీ  జాడ   వెతికే   అర్బకుడిని

   నీ  నీడ    కోరేటి   అల్పుడిని

• మహకాలుడా     మహాదేవుడా

  సిద్దయోగుడా     సదానందుడా


• విడవాలని ఉంది     విడిచి రావాలని ఉంది


• బంధాల  కొలిమి లో   కాలితే కాని

  కానరావా   శివా

• అయితే   నిర్బంధాల   నడుమ

  బూడిద  గాంచు  హర

• శరణు తో అడుగుతున్నాను


• విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది


• నీ పదము ఎంత మధురం

  నీ పాదము అంత శరణం.

• నీ తలపు ఎంత తన్మయం

  నా ఆత్మకు అంత ఆనందం.


• ఆనంద నిలయా    మార్తాండ హృదయ

  విడవాలని ఉంది    విడిచి రావాలని ఉంది



కబళింపు = మింగి వేయుట

సంబాళింపు =ఓదార్పు, ఆదరింపు

అర్బకుడు = శక్తి హీనుడు.

అల్పుడు = ఆధారం లేని వాడు, నిరాధారుడు.


యడ్ల శ్రీనివాసరావు 15 August 2022 2:00 AM











No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...